Gold chain melts: ఆదిలాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన.. పిడుగుపాటుకు కరిగిన బంగారం..!
సాధారణంగా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడటం మనం చూస్తూనే ఉంటాం. పిడుగుపాటుకు గురైతే మనుషులు, జంతువులు పిట్టలా రాలిపోతారు.
- Author : Gopichand
Date : 16-10-2022 - 8:42 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడటం మనం చూస్తూనే ఉంటాం. పిడుగుపాటుకు గురైతే మనుషులు, జంతువులు పిట్టలా రాలిపోతారు. అయితే.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో షాకింగ్ కు గురిచేసే ఘటన జరిగింది. పిడుగుపాటుకు శరీరంపై బంగారు గొలుసు కరిగిపోవడంతో పాటు ఒక మహిళ తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదిలాబాద్‌లోని పొచ్చర సమీపంలోని దిమ్మ గ్రామ శివారులో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివార్లలోని పొలంలో పనిచేస్తున్న శ్వేత పిడుగుపాటుకు తీవ్రగాయాల పాలైంది. గ్రామస్థులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటుకు వచ్చిన వేడికి ఆమె మెడలోని బంగారు గొలుసు కరిగిపోయిందని చెబుతున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రసుత్తం మహిళ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది