HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Funds Should Be Spent As Per Sc And St Sub Plan Act Deputy Cm Bhatti

Deputy CM Bhatti: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి

ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేసేందుకు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలతో ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సమావేశమై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

  • Author : Gopi Date : 17-01-2025 - 6:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deputy CM Bhatti
Deputy CM Bhatti

Deputy CM Bhatti: ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) అన్నారు. ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో సమావేశం నిర్వహించారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం శాఖల వారీగా చేసిన ఖర్చు వివరాలను ప్రతి నెల రోజులకు ఒకసారి వెల్లడించాలని అధికారులను ఆదేశించారు.

ఉన్న నిధులను సంపూర్ణ స్థాయిలో వినియోగించాలని కోరారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం చేస్తున్న వ్యయం ఆయా వర్గాల్లో ఆదాయం బాగా పెరిగేలా, ఆస్తులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనెల 23న నిర్వహించబోయే సమావేశానికి రావాలని అధికారులను కోరారు. సబ్ ప్లాన్ చట్టం కోటా ప్రకారం ఇప్పటివరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రాబోయే రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆయా శాఖ అధికారులను ప్రశ్నించారు. బడ్జెట్ యేతర నిధులు ఖర్చు చేసే సమయంలోను ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం జనాభా దామాషాలో నిధుల ఖర్చు జరిగిందా? లేదా? అందుకు సంబంధించిన సంపూర్ణ సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.

అమలుకు సంబంధించి గత ఎనిమిది సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో వివిధ శాఖల్లో అధ్యయనం చేసిన సెస్ నివేదికను సమావేశాలు సంబంధిత అధికారులు ప్రదర్శించారు. సెస్ అధికారులు పరిశీలించిన అంశాలు, వారు పరిశీలించిన అంశాలపై అధికారులు సాధించిన ఫలితాలను డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఇకనుంచి సెస్ అధికారులు తమ నివేదికలను ఫైనాన్స్, ప్లానింగ్ శాఖ అధికారులకు అందజేసి వారితో తరచూ సమావేశం కావాలని సెస్ అధికారులను ఆదేశించారు.

Also Read: Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి.. ఆటో డ్రైవ‌ర్ ఏం చెప్పాడంటే?

అటవీ భూముల్లో సోలార్ పవర్ ద్వారా మోటార్లు వినియోగించడం. ఆయా భూముల్లో వెదురు, అవకాడో, పామాయిల్ వంటి వాటితోపాటు అంతర పంటల సాగు ప్రాజెక్టులు డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రయత్నం ద్వారా అడవులను సంరక్షించడంతోపాటు ఆదివాసి, గిరిజన రైతులకు ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. మూసి పునర్జీవనం కార్యక్రమంలో నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించి వారికి వడ్డీ లేని రుణాలు అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రవాణా వాహనాలు, క్లీనింగ్ యంత్రాలు ఆయా వర్గాలకు అందించాలని సూచించారు. ఇందిర జల ప్రభ, మరమ్మతులకు గురైన ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆర్థిక చేయూతను అందించాలన్నారు.

ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేసేందుకు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలతో ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సమావేశమై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్ రాజ్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఎస్టి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • congress
  • Deputy CM Bhatti
  • hyderabad
  • SC- ST Sub Plan
  • telangana
  • telugu news

Related News

Cab

Hyderabad : హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌కు షాక్‌.. సిగిరెట్ తెమ్మ‌ని..?

హైద‌రాబాద్‌లో క్యాబ్ డ్రైవ‌ర్‌ని మోస‌గించి కార్‌తో దుండ‌గుడు ప‌రారైయ్యాడ‌. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సి. భాను ప్రభు (26) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను సంప్రదించి చంగిచెర్లకు వెళ్లేందుకు రూ.450 అద్దె ఇస్తానని చెప్పడంతో అతడిని వాహనంలో ఎక

  • Actress Shweta Menon resigns as 'AMMA' President.

    Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

  • ‘Amazon Beautyverse 2026’ event concludes in Mumbai

    Amazon Beautyverse 2026: ముంబైలో ముగిసిన ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’ ఈవెంట్

  • IMD Alert

    Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • KTR

    ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

Latest News

  • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

  • Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

  • ACB Raids : ఎక్సైజ్ అధికారి ఇళ్ల‌పై ఏసీబీ దాడులు..

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd