HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Minister Jagdish Reddys Comments On The Congress Govt

Jagdish Reddy: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి (Jagdish Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోట‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉద‌యం ప‌రిశీలించారు.

  • Author : Gopichand Date : 04-04-2024 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagadish Reddy
Safeimagekit Resized Img (3) 11zon

Jagdish Reddy: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి (Jagdish Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోట‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్‌తో కలిసి గురువారం ఉద‌యం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దుర‌దృష్ట‌వశాత్తు ప‌రిపాల‌న అనేదే అడ్ర‌స్ లేకుండా పోయిందని విమ‌ర్శించారు. అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ నాయ‌కులు ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌ట‌మే స‌రిపోతుంద‌న్నారు. అధికారులు ఎవ‌రి ప‌నుల్లో వారే ఉన్నారు. ప్ర‌జ‌ల‌ను మాత్రం గాలికి వ‌దిలేశార‌ని ఆరోపించారు. సాగునీటి నిర్వ‌హణ‌, తాగు నీటి నిర్వ‌హ‌ణ అధ్వానంగా త‌యారైంద‌ని అన్నారు.

2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయన్నారు. 2014కు ముందు నాగార్జున సాగ‌ర్‌లో నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులు రాష్ట్రంలో చూస్తాన‌మ‌న్నారు. కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్రభుత్వం ప్రజలను, పాలనను గాలికి వదిలేసిందని, సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమ‌ర్శించారు. నాగార్జునసాగర్‌ను మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Also Read: Emergency Landing: లడఖ్‌లో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

తెలంగాణ‌లో అవినీతికి పాల్ప‌డి ఢిల్లీకి డ‌బ్బు పంపే ప‌నిలో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం బిజీగా ఉంద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌పై దృష్టి పెట్టి వారికి తాగునీరు అందించేలా కార్య‌చ‌ర‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. కేసీఆర్ బ‌య‌టికి రాగానే ప్రాజెక్టుల నుంచి నీళ్ల‌ను బ‌య‌ట‌కు వదిలార‌ని మాజీ మంత్రి గుర్తుచేశారు. అంతేకాకుండా ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించే వాట‌ర్ ట్యాంకుల‌ను తనిఖీ చేసే స‌మ‌యం కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కానీ అధికారులు కానీ లేద‌న్నారు.

2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయి

నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.

ప్రభుత్వం ప్రజలను,పాలనను గాలికి… https://t.co/SB6zy21ppO pic.twitter.com/7XXiGFgYK3

— Telugu Scribe (@TeluguScribe) April 4, 2024

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలోని వాటర్‌ ట్యాంకులో పడి 30 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. 200 ఇళ్లకు తాగునీరు సరఫరా చేసేలా ఈ ట్యాంకు నిర్మించి పైన రేకులు వేశారు. కాగా, ఎండలు మండిపోతుండటంతో నీళ్లు తాగేందుకు ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలు కోల్పోయాయి. కోతులు మరణించిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Jagadish Reddy
  • kcr
  • Nalgonda
  • telangana

Related News

Rajya Sabha Elections

Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Jangaon Thorrur Congress

    లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

  • వనస్థలిపురం గర్భిణి హత్య కేసు..వెలుగులోకి షాకింగ్ నిజాలు !!

  • సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

  • ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు..త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌

  • బిల్డర్లకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరట..100% పన్ను కట్టక్కర్లేదు !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd