HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Former Minister Harish Rao Hot Comments On Congress Government

Harish Rao: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పోలీసు రాజ్యమైందని, మా కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని మా ఆరోపణలు వాస్తవమని కాంగ్రెస్ నాయకుడైన చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంద‌న్నారు.

  • Author : Gopi Date : 25-02-2025 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao: ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీల‌క నేత హ‌రీష్ రావు (Harish Rao) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 5 నుంచి 10లక్షల వరకు ఇచ్చారని చిన్నారెడ్డి బట్టబయలు చేశారు. ఈడీలు, సీబీఐలు, ఐటీలు, ఎన్నికల్ కమిషన్లు ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? మంత్రి పొంగులేటి ఇంటిపైన ఈడీ రైడ్ అయితే ఈడి ఒక నోటీస్ ఇవ్వలేదు. సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదు? అని ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారు? బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బీజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు చిన్నారెడ్డి నిన్న వనపర్తిలో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న విధానానికి అద్దం పడుతున్నాయని విమ‌ర్శించారు.

Also Read: Daggubati Venkateswara Rao : 30 ఏళ్ల తరువాత కలిసిన తోడళ్లుల్లు

ఇందిరమ్మ రాజ్యం.. పోలీసు రాజ్యమైందని, మా కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని మా ఆరోపణలు వాస్తవమని కాంగ్రెస్ నాయకుడైన చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంద‌న్నారు. ‘‘పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలి కారుల్లాగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే కేసు పెట్టుమంటే పెట్టాలె, తీసేయమంటే తీసేయాలె అనే స్థాయికి దిగజారారు. గతంలో ఎన్నడూ ఒక ఎమ్మెల్యేకు అధికారులు ఇంతగా భయపడిన దాఖలాలు లేవు. నా 46 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా పోలీసులు, అధికారులు ఎన్నడూ ప్రవర్తించలేదు’’ అని చిన్నారెడ్డి బహిరంగంగా ప్రభుత్వ తీరును ఎండగట్టారని అని అన్నారు.

కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నది నిజమేనని నాడు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నేడు వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వంలో పోలీసులు, అధికారుల తీరు ఇట్లా ఉంటే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నోట్ల రాజకీయం నగ్న తాండవం చేస్తుంద‌ని, ఈ విషయాన్ని కూడా చిన్నారెడ్డి స్వయంగా వెల్లడించారన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm revanth
  • congress
  • harish rao
  • telangana
  • telugu news

Related News

Transfers

Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

పరిపాలనా అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లను జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు), భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు (ఎస్‌డీసీలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వ

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Ev Bus

    EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

  • Cm Revanth Reddy

    Telangana : కొత్త డిజైన్లతో ఇందిరమ్మ చీరలు.. లబ్ధిదారులకు త్వరలో అందుబాటులోకి

  • Weather Update

    Telangana : తెలంగాణ‌లో రుతుప‌వ‌నాలు మ‌రింత ఆల‌స్యం

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • Food Safety : మూసాపేటలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. రెస్టారెంట్‌లో బయటపడిన షాకింగ్ లోపాలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd