HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Farmers Should Be Given Farmer Assurance Maoist Party Letter Released

Maoist Party Letter: ఆదివాసీ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి.. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల!

జీవో 49 పులుల రక్షణ పేరుతో కొమురం భీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

  • Author : Gopichand Date : 26-06-2025 - 10:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maoist Party Letter
Maoist Party Letter

Maoist Party Letter: తెలంగాణలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు ఊపందుకుంటున్న వేళ, రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) నిశ్శబ్దం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 339 గ్రామాల నివాసితులను ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నాయి. ఈ జీవో కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసమేనని, ఆదివాసీల జీవనాన్ని, సంస్కృతిని నాశనం చేసే కుట్రగా ఉందని నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీ (Maoist Party Letter) అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖ ఆరోపించింది.

ఆదివాసీ హక్కులపై జీవో 49 వివాదం

జీవో 49 పులుల రక్షణ పేరుతో కొమురం భీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా మూడు జిల్లాలు తెలంగాణ పటంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ 8, 2025న ఆసిఫాబాద్‌లో తుడుందెబ్బ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ నిరసన ర్యాలీలో ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. “ఆదివాసుల ఓపికను పరీక్షించొద్దు, జీవో రద్దు చేయకపోతే అగ్నిగుండమవుతుంది” అని తుడుందెబ్బ అధ్యక్షుడు కొట్నాక్ విజరు హెచ్చరించారు.

మావోయిస్టు పార్టీ లేఖలో “ఈ జీవో జంతు పులుల కోసం కాదు, అంబానీ, ఆదానీలాంటి మానవ పులుల కోసం” అని విమర్శించారు. వేల సంవత్సరాలుగా అడవులతో సహజీవనం చేస్తున్న ఆదివాసీలను వారి భూముల నుంచి బలవంతంగా తొలగించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రగా ఈ జీవోను అభివర్ణించారు. రాజ్యాంగం ప్రకారం అడవి సంపద, భూములకు ఆదివాసీలే హక్కుదారులని, కానీ వారి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.

Also Read: Uttarakhand : అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు

సీతక్క నిశ్శబ్దంపై ప్రశ్నలు

ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఆదివాసీ సమస్యలపై మౌనం వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆదివాసీ బిడ్డగా, మాజీ నక్సలైట్‌గా ప్రాచుర్యం పొందిన సీతక్క తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదని మావోయిస్టు పార్టీ, ఆదివాసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. “ఆదివాసీ హక్కుల పరిరక్షణ బాధ్యత సీతక్కదే. ఆమె మాట్లాడకపోవడం సిగ్గుచేటు, అవమానకరం,” అని మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు.

ఆదివాసీ డిమాండ్లు

  • జీవో 49ను తక్షణం రద్దు చేయాలి.
  • 12 లక్షల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలకు భూమి హక్కు పత్రాలు (పట్టా సర్టిఫికెట్స్) ఇవ్వాలి.
  • ఆదివాసీ రైతులకు రైతు భరోసా ఆర్థిక సాయం అందించాలి.
  • ఆదివాసీ సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Maoist Party
  • Maoist Party Letter
  • Minister Seethakka
  • telangana
  • telugu news

Related News

New Amrit Bharat Express.

తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Amrit Bharat Express  హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జన

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Kalvakuntla Kavitha

    Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd