HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ex Bjp Mp Quits Ahead Of Munugode Bypoll To Join Trs

Telangana: మునుగోడు ఎన్నికల ముందు బీజేపీకి మరో షాక్..!

రానున్న మునుగోడు ఉప ఎన్నికకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఎదురుదెబ్బ తగిలింది.

  • Author : Gopichand Date : 24-10-2022 - 3:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (1)
Cropped (1)

రానున్న మునుగోడు ఉప ఎన్నికకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ సోమవారం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరనున్నారు. ఈ విషయమై భాస్కర్ ఆదివారం ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)తో మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణలో చేనేతలపై జిఎస్‌టి విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ నిరాశను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడానికి కెసిఆర్ తీసుకుంటున్న చర్యలను తాను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు.

భాస్కర్ చేనేత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. తెలంగాణలో చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడు జిల్లాలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు ముందు కొంత మంది బిజెపి నాయకులు టిఆర్‌ఎస్ వైపు మారడం గమనించాల్సిన విషయం. ఈ నెల ప్రారంభంలో బూడిద బిక్షమయ్య గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. దీనికి ముందు టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన శ్రవణ్ దాసోజు తిరిగి టిఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

2012-18 మధ్య రాపోలు ఆనంద భాస్కర్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాజ్యసభకు ఎన్నిక కాక ముందు ఆనంద భాస్కర్ జర్నలిస్టుగా పని చేశారు. చేనేత రంగంపై కేంద్రం జీఎస్టీ విధించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాపోలు ఆనంద భాస్కర్‌ బీజేపీలో చేరారు. మారిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాపోలు ఆనంద్‌ భాస్కర్‌.. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోవడం ఆసక్తికర పరిణామం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BJP Ex MP
  • cm kcr
  • Handloom
  • Rapolu Ananda Bhaskar
  • trs

Related News

    Latest News

    • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

    • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

    • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

    Trending News

      • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

      • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

      • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

      • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

      • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd