Telangana: నన్ను జైలుకు పంపించింది ఎర్రబెల్లి .. రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడదని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఐటీ దాడులు నిర్వహించి భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
- Author : Praveen Aluthuru
Date : 09-11-2023 - 5:26 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడదని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఐటీ దాడులు నిర్వహించి భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో రేవంత్ బీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. తనను జైలులో పెట్టడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు కారణమని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడదని అన్నారు.పొంగులేటిపై ఐటీ అధికారులు భారీ దాడులు నిర్వహించి భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది బీఆర్‌ఎస్, బీజేపీల రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఇలాంటి రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ నేతలు భయపడరని స్పష్టం చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కాంగ్రెస్ అండగా ఉందని చెప్పారు, ఓటమి భయంతో బీఆర్ఎస్, బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నదని తెలిపారు. గత వారం రోజులుగా కాంగ్రెస్ నేతల ఇళ్లపైనే ఐటీ దాడులు జరుగుతున్నాయని, బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: ICC Rankings: ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటిన టీమిండియా.. టాప్ ప్లేస్ లో గిల్, సిరాజ్, కోహ్లీ