HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >End To The Problem Of Fee Arrears Private Colleges Strike Called Off

Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు.

  • Author : Gopi Date : 07-11-2025 - 10:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Private Colleges
Private Colleges

Private Colleges: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలకు (Private Colleges) సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య చివరకు కొలిక్కి వచ్చింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రజాభవన్‌లో యూనియన్ నాయకులతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్ (సమ్మె)ను తక్షణమే విరమించుకుంటున్నట్టు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రకటించింది.

బకాయిల విడుదలపై స్పష్టమైన హామీ

ప్రైవేట్ యాజమాన్యాలు కోరిన బకాయిల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టమైన ప్రణాళికను ప్రకటించారు. గతంలో హామీ ఇచ్చిన రూ. 1,200 కోట్లలో రూ. 600 కోట్లు ఇప్పటికే విడుదల చేశారు. మిగిలిన రూ. 600 కోట్లు ఈ నెలలో అంటే మూడు నుంచి నాలుగు రోజుల్లోపే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. యాజమాన్యాలు అదనంగా కోరిన రూ. 300 కోట్లకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చూపే దిశలో యాక్షన్ ప్లాన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రకటన పట్ల సానుకూలంగా స్పందించిన పాతి సంఘం సభ్యులు.. నవంబర్ 3వ తేదీ నుంచి కొనసాగుతున్న కళాశాలల బంద్‌ను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ ఆలోచించి ఈ చర్చల్లో పాల్గొనడం జరిగింది. రేపటి నుంచి రాష్ట్రంలో కళాశాలల బంద్ అనేది ఉండదు. కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించి ప్రతి నెలా ఎంతో కొంత తప్పనిసరిగా విడుదల చేస్తామ‌ని వివ‌రించారు.

Also Read: Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

కమిటీ ఏర్పాటు, సంస్కరణలకు అవకాశం

ఫీజు రియంబర్స్మెంట్‌తో పాటు కళాశాలల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని యాజమాన్యాలు గతంలో కోరాయి. వారి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అధికారులతో పాటు యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫీజు బకాయిలు, ఇతర సమస్యలకు సంబంధించి ఎలాంటి సంస్కరణలు అవసరమో అధ్యయనం చేసి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కమిటీని కోరతామని ఆయన పేర్కొన్నారు.

నిరసన కార్యక్రమాలు రద్దు

చర్చలు సఫలం కావడంతో నవంబర్ 8న అనుకున్న లెక్చరర్ల ప్రదర్శన (యాక్షన్ ప్లాన్), అలాగే నవంబర్ 15న విద్యార్థులతో చేపట్టాలనుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు పాతి సంఘం జనరల్ సెక్రెటరీ రవికుమార్ తెలిపారు. రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుంటాం. పిల్లలను రోడ్లపైకి తెచ్చే ఆలోచన చేయం. ఎన్నికల కోడ్ సమయంలో నిరసన కార్యక్రమాలు తప్పు అని కోర్టు చెప్పింది. మాలో పొరపాటు వల్లే ఇది జరిగిందని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • DCM Bhatti
  • Fee Arrears
  • Private Colleges
  • telangana
  • telugu news

Related News

Transfers

Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

పరిపాలనా అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లను జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు), భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు (ఎస్‌డీసీలు)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వ

  • Ev Bus

    EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

  • Cm Revanth Reddy

    Telangana : కొత్త డిజైన్లతో ఇందిరమ్మ చీరలు.. లబ్ధిదారులకు త్వరలో అందుబాటులోకి

  • Weather Update

    Telangana : తెలంగాణ‌లో రుతుప‌వ‌నాలు మ‌రింత ఆల‌స్యం

  • Orr Car

    ORR CAR : స్పీడ్ మోజు.. ఓఆర్ఆర్‌పై 200 కి.మీ వేగంతో కార్ డ్రైవింగ్‌

Latest News

  • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

  • IPL 2026 : సూర్యవంశీ విధ్యంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd