Elevated Corridor : తెలంగాణ, ఏపీ నడుమ ఎలివేటెడ్ కారిడార్.. హైట్ 30 అడుగులు
అందుకే వాటి మీదుగా ఎలివేటెడ్ కారిడార్(Elevated Corridor)ను నిర్మించనున్నారు.
- Author : Pasha
Date : 10-11-2024 - 9:28 IST
Published By : Hashtagu Telugu Desk
Elevated Corridor : హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. హైవే-756లోని హైదరాబాద్-శ్రీశైలం సెక్షన్ మధ్య ట్రాఫిక్ క్రమంగా పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని జాతీయ రహదారిని 2 వరుసల నుంచి 4 వరుసలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ ప్రాజెక్టు నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వు మీదుగా వెళుతోంది. ఈ రెండు అటవీ ఏరియాల్లో వన్యప్రాణులు తిరుగుతుంటాయి. అందుకే వాటి మీదుగా ఎలివేటెడ్ కారిడార్(Elevated Corridor)ను నిర్మించనున్నారు. మిగతాచోట్ల భూభాగంలోనే రోడ్డును 2 లేన్ల నుంచి 4 లేన్లకు విస్తరిస్తారు.
Also Read :Delhi Ganesh : ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత..!
ఎలివేటెడ్ కారిడార్ అడవి నుంచి దాదాపు 30 అడుగుల హైట్‌లో ఉండనుంది. మన్ననూరుకు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచి పాతాళగంగ వరకు ఉన్న జాతీయ రహదారి తెలంగాణ పరిధిలోకి వస్తుంది. పాతాళగంగ తర్వాతి ఏరియా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోకి వస్తుంది. తెలంగాణలో 62.5 కి.మీ మేర జాతీయ రహదారిని విస్తరించనుండగా.. ఇందులో దాదాపు 45.42 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ప్రస్తుతం ఫారెస్టు పరిధిలోని భూసేకరణ విషయమై కేంద్ర ఉపరితల రవాణాశాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలంగాణ అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
Also Read :Koratala Siva : స్టార్ తనయుడితో కొరటాల శివ భారీ ప్లాన్.. ఎవరు ఊహించని కాంబో..!
జాతీయ రహదారిని విస్తరించిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వాహనాలు 24 గంటలు రాకపోకలు సాగించనున్నాయి. అయితే ఎలివేటెడ్ కారిడార్ నుంచి అడవిలోకి వాహనాలు దిగేలా ర్యాంపులు నిర్మించవద్దని అటవీ అధికారులు షరతు పెట్టినట్లు సమాచారం. ఎలివేటెడ్ కారిడార్‌పై లైటింగ్ ఎక్కువగా ఉంటే వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. నేషనల్ వైల్డ్‌లైఫ్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. కాగా, హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు దాదాపు 147.31 హెక్టార్ల భూమిని సేకరించనున్నట్లు సమాచారం.