KCR: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఈసి అధికారులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈసీ అధికారులు షాక్ ఇచ్చారు. రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈసీ అధికారులు ఆయన వాహనాన్ని మార్గమధ్యంలో తనిఖీ చేశారు.
- Author : Praveen Aluthuru
Date : 31-03-2024 - 4:25 IST
Published By : Hashtagu Telugu Desk
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈసీ అధికారులు షాక్ ఇచ్చారు. రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈసీ అధికారులు ఆయన వాహనాన్ని మార్గమధ్యంలో తనిఖీ చేశారు. నష్టపోయిన రైతుల్ని కలుసుకునేందుకు విపక్ష నేతగా తొలి పర్యటన సందర్భంగా కేసీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.
పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నేడు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తున్నారు. రైతు సమస్యలు విని చలించిపోయిన కేసీఆర్ ఓ రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. పొలం ఎండిపోయింది, కొడుకు పెళ్లి ఉందని తమ బాధలు చెప్పుకున్న కుటుంబానికి కేసీఆర్ ఆర్ధిక సాయం చేశారు. మరోవైపు రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పెట్రోలింగ్‌లో భాగంగా అధికారులు కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆదివారం ఉదయం ఎర్రవెల్లి నుంచి జనగాం జిల్లా ధరావత్ తండా వరకు కేసీఆర్ పర్యటన సాగింది. పర్యటనలో భాగాంగా ఓ రైతు గోడు విన్న ఆయన సాయం చేశారు. నాలుగు బోర్లు వేసినా నాలుగు ఎకరాల్లో పంట నష్టపోయిన అంగోతు సత్తెమ్మ అనే రైతును కలిసి తాను రూ.4-5 లక్షల అప్పుల్లో ఉన్నానని కేసీఆర్‌కు చెప్పారు. రైతులు ధైర్యంగా ఉండాలని, మన నీళ్లు తెచ్చుకునేందుకు పోరాడాలని కేసీఆర్ హామీ ఇచ్చారు.
అంతకుముందు రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను కేసీఆర్ పరామర్శిస్తారని బీఆర్‌ఎస్ ప్రకటించింది, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసింది. కాగా మార్చి 16న మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్‌కు జెడ్‌ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్