వాట్సాప్ లో దందా.. 4 లక్షల విలువైన గంజాయి స్వాధీనం!
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అంతటా గంజాయి గుప్పుమంటోంది. పోలీసులు దాడులు చేసినా, ఎక్సైర్ శాఖ నిఘా పెడుతున్నా గంజాయి దందాకు పుల్ స్టాఫ్ పడటం లేదు.
- By Balu J Published Date - 12:31 PM, Wed - 20 October 21

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అంతటా గంజాయి గుప్పుమంటోంది. పోలీసులు దాడులు చేసినా, ఎక్సైర్ శాఖ నిఘా పెడుతున్నా గంజాయి దందాకు పుల్ స్టాఫ్ పడటం లేదు. తాజాగా పలు డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, అఫ్జల్‌గుంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 4 లక్షల విలువైన 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన నాగసాయి (24), అంబర్‌పేట్, మలక్‌పేట్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు కేసులు నమోదయ్యాయి. గంజాయి సప్లయ్ చేస్తూ, మరోసారి పోలీసులకు దొరికాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ నాగసాయి స్థానిక ఏజెంట్లు, అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి, కావాల్సినవాళ్లకు గంజాయిని అందిస్తున్నాడని అన్నారు.
పెద్ద మొత్తంలో గంజాయి కోసం నాగసాయిని కాంటాక్ట్ అవుతుంటారని, స్థానిక ఏజెంట్లు, స్మగ్లర్లతో డీల్ కుదర్చుకొని ఇతరులకు సప్లయ్ చేస్తుంటాడని సీపీ అన్నారు. సప్లయ్ చేసినందుకుగానూ కమిషన్ ఇస్తాడని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రగ్ పెడ్లర్లతో నాగసాయికి పరిచయాలు ఉన్నాయని, వాళ్లందరికీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని సీపీ అన్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నాగ సాయి కోసం నిఘా పెట్టారు. ప్రేమ్ సింగ్‌కు అనే వ్యక్తి డ్రగ్స్ డెలివరీ చేయడానికి సెంట్రల్ బస్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు అరెస్టు చేశామని అంజనీ కుమార్ తెలిపారు.
డబ్బును ఈజీగా సంపాదించాలన్న ఆశతో కొందరు గంజాయి రవాణాను మార్గంగా ఎంచుకుంటున్నారు. కొన్ని ముఠాలు ఆ వ్యాపారాన్ని విస్తరించేస్తున్నాయి. ఏపీలోని విశాఖపట్నం నుంచి రాష్ట్రానికి గంజాయి ఎక్కువగా సరఫరా అవుతోంది. సరిహద్దులను దాటించేందుకు డ్రగ్స్ స్మగ్లర్లు.. గంజాయిని ప్లాస్టిక్ కవర్లలో చుట్టి లారీల్లో బొగ్గు పొడి కింద పెట్టి పంపిస్తున్నారు. పైపుల్లో, ఫ్లై యాష్ ఇటుకల్లో పెట్టి బార్డర్ దాటిస్తున్నారు. గంజాయి వాసన రాకుండా గట్టిగా ప్యాక్ చేస్తున్నారు. అలా బార్డర్లు దాటిన గంజాయిని బైకులు, ఆటోల్లోనే సిటీలో సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో సారాను బ్యాన్ చేయడంతో.. ఆ వ్యాపారం చేసేటోళ్లే ఇప్పుడు గంజాయి దందాను చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట, మంగళ్‌హాట్, పాతబస్తీలోని ఫలక్‌నుమా, ఉప్పుగూడ, పురానాపూల్, జియాగూడ బస్తీల్లో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది.
Related News

Hyderabad Ganesh Immersion: హైదరాబాద్లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర
కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం విగ్రహాల నిమజ్జనం జరుగుతుండగా హైదరాబాద్లో మహా గణేష్ ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది.