HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >How To Test If You Are Strong

మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?

వీటిలో ప్రోటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కండరాల పుష్టికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.

  • Author : Gopichand Date : 12-01-2026 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Strong Test
Strong Test

Strong Test: శరీరం బలంగా ఉంటే మనిషి త్వరగా అలసిపోడు, ఎముకల నొప్పులు ఉండవు. బరువులు ఎత్తడంలో ఇబ్బంది కలగదు. చిన్నపాటి దెబ్బలకు విలవిలలాడడు. అయితే, చాలామంది తమ శరీరం బలంగా ఉందని అనుకుంటారు, కానీ పరీక్షించి చూస్తే శరీరంలో సత్తువ లేదని అర్థమవుతుంది. అందుకే మీరు నిజంగా స్ట్రాంగ్‌గా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి వైద్యులు సూచించిన ఈ 20 సెకన్ల టెస్ట్ చేసి చూడండి.

మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?

ఈ సింపుల్ టెస్ట్ చేయడానికి మీకు ఒక కుర్చీ అవసరం. కుర్చీపై కూర్చుని ఆపై లేవాలి. మళ్ళీ కూర్చోవాలి. అయితే ఇలా లేచేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు మీ చేతులను కుర్చీకి గానీ, మోకాళ్లకు గానీ ఆనించకూడదు.

Also Read: మొహమ్మద్ రిజ్వాన్‌కు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర అవమానం!

ఈ పరీక్ష ఫలితాలు ఇలా ఉంటాయి

20 సెకన్లు: మీరు 20 సెకన్ల పాటు నిరంతరం ఇలా చేయగలిగితే మీ ఫిట్‌నెస్ లెవల్ ‘ఎక్సలెంట్’ (చాలా బాగుంది) అని అర్థం.

15 నుండి 19 సెకన్లు: మీ ఫిట్‌నెస్ ‘మంచి’ స్థితిలో ఉన్నట్లు.

10 నుండి 14 సెకన్లు: మీ శారీరక బలం ‘యావరేజ్’గా ఉన్నట్లు.

10 సెకన్ల కంటే తక్కువ: మీరు ఇలా 10 సెకన్లు కూడా చేయలేకపోతే మీ శరీరం బలహీనంగా ఉందని అర్థం.

శారీరక బలాన్ని పెంచే ఆహారాలు

శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి మీ డైట్‌లో ఈ క్రింది ఆహారాలను చేర్చుకోండి.

గుడ్లు: శరీర బలానికి గుడ్డు ఉత్తమమైనది. ఇందులో హై-ప్రోటీన్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర స్టామినాను, శక్తిని పెంచుతాయి.

ఆకుకూరలు: మీ భోజనంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. వీటిలో కొవ్వు తక్కువగా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్టామినా పెరగడానికి సహాయపడుతుంది.

డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్స్ (అక్రోట్), జీడిపప్పు వంటివి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. స్ట్రెంత్‌ను బూస్ట్ చేస్తాయి.

చేపలు: చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, పుష్కలమైన ఎనర్జీ లభిస్తుంది.

గుమ్మడి గింజలు: వీటిలో ప్రోటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కండరాల పుష్టికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • Health Tips Telugu
  • healthy body
  • lifestyle
  • Strong Bones
  • Strong Test

Related News

Budget 2026

బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కోసం కేటాయింపులను 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. భారత్‌ను గ్లోబల్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు ISM 2.0 (ఇండియా సెమీకండక్టర్ మిషన్) రెండో దశను ప్రారంభించనున్నారు.

  • Urine

    మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • Sleeping At Night

    భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

  • Ear Piercing

    పిల్లల చెవులు కుట్టించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

  • Benefits of bitter gourd juice..it is a panacea for these 2 diseases..!

    కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..ఈ 2 వ్యాధులకు దివ్యౌషధమే..!

Latest News

  • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

  • జనవరిలో రికార్డు స్థాయి UPI లావాదేవీలు

  • నాని అభిమానులకు షాక్ ?

  • పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

Trending News

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd