HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Donald Trump As President Of Venezuela A Wikipedia Screenshot

వెనిజులా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. వికీపీడియా’ స్క్రీన్ షాట్!

  • Author : Vamsi Chowdary Korata Date : 12-01-2026 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump posts image showing himself as Acting President of Venezuela
Donald Trump posts image showing himself as Acting President of Venezuela

Donald Trump Posts Image Showing Himself As Acting President Of Venezuela ప్రపంచ రాజకీయ చిత్రపటంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను నాటకీయంగా బంధించి అమెరికాకు తరలించిన కొద్ది రోజులకే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో బాంబు పేల్చారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వెనిజులాకు తానే తాత్కాలిక అధ్యక్షుడిని అంటూ ప్రకటించుకుని దౌత్య వర్గాలను షాక్‌కు గురిచేశారు. వికీపీడియా పేజీని పోలిన ఒక ఎడిటెడ్ ఫొటోను షేర్ చేస్తూ.. ఈ ఏడాది జనవరి నుంచే తన పాలన మొదలైందన్నట్లుగా ఆయన సంకేతాలిచ్చారు.

అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పెనుదుమారం రేపారు. వెనిజులాలో నెలకొన్న అనిశ్చితి మధ్య ఏకంగా తనను తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకుని ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో వికీపీడియా పేజీని పోలి ఉన్న ఒక ఎడిటెడ్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ ఈ ప్రకటన చేశారు. ఆ ఫొటోలో 2026 జనవరి నుంచి వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినట్లు ఉండటంతో ఇప్పుడిది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

అసలేం జరిగుతుందంటే..?

గత కొద్ది రోజులుగా వెనిజులాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే నెపంతో అమెరికా బలగాలు ఇటీవల వెనిజులా రాజధాని కారకాస్‌పై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుని వాషింగ్టన్‌కు తరలించింది. ఈ పరిణామం లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మదురో నిర్బంధం తర్వాత వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె 90 రోజుల పాటు అధికారంలో ఉంటారని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే వెనిజులా తదుపరి పూర్తిస్థాయి నాయకుడు ఎవరనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది.

వాస్తవానికి వెనిజులా విపక్ష నేత, నోబెల్ విజేత మరియా కొరినా మచాడోను అధ్యక్షురాలిగా ఎన్నుకుంటారని అందరూ భావించారు. కానీ ట్రంప్ ఆమె పట్ల విముఖత చూపడం గమనార్హం. మచాడోకు ప్రజల్లో తగినంత మద్దతు లేదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తానే వెనిజులా బాధ్యతలు చూస్తానన్నట్లుగా ట్రంప్ పోస్ట్ చేయడం కొత్త దౌత్య వివాదానికి దారితీసింది.

అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు

ఒక దేశాధ్యక్షుడు మరో దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం దౌత్య చరిత్రలో అరుదైన విషయం. ఇది కేవలం ట్రంప్ మార్కు హాస్యాస్పద పోస్టా? లేక వెనిజులాను తన చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు అమెరికా వేస్తున్న వ్యూహమా? అన్నది అర్థం కాక దౌత్యవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఏకంగా దేశ అధికార పగ్గాలు తనవే అనడం చర్చనీయాంశంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • breaking news
  • Donald Trump
  • international news
  • Venezuela president

Related News

The US has imposed 50% tariffs on Canadian goods, further intensifying the North American trade war.

Donald Trump: కెనడియన్ వస్తువులపై 50% సుంకాలు విధించిన అమెరికా.. ఉత్తర అమెరికా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం.

ఈ సుంకాలు 30 రోజుల్లో అమల్లోకి వస్తాయి మరియు వైన్, హాకీ స్టిక్స్, సిమెంట్, పాల ఉత్పత్తులు, ఫర్నిచర్, దుస్తులు మరియు ఇతర వస్తువులతో సహా పలు రకాల ఉత్పత్తులను కవర్ చేస్తాయి. అమెరికాకు చెందిన మద్యం, ఆటోమొబైల్ మరియు పాల ఉత్పత్తుల పట్ల ఒట్టావా “వివక్షాపూరిత వైఖరి” చూపుతోందని ఆరోపిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అనేక కెనడియన్ వస్తువులపై కొత్తగా 50 శాతం సుంకా

  • Countdown to a major war? Iran warns of 'Zero Hour'… US prepares to send fighter jets to Israel.

    Donald Trump: పెద్ద యుద్ధానికి కౌంట్‌డౌన్? ‘జీరో అవర్’ గురించి ఇరాన్ హెచ్చరిక.. ఇజ్రాయెల్‌కు యుద్ధ విమానాలను పంపేందుకు అమెరికా సన్నద్ధం

  • COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

    Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

  • Following Iran's threat to close the Strait of Hormuz... attacks on a Kuwaiti refinery and US infrastructure in Bahrain.

    Kuwait Refinery: హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ హెచ్చరించడంతో.. కువైట్ రిఫైనరీ, బహ్రెయిన్‌లోని అమెరికా మౌలిక సదుపాయాలపై దాడి

Latest News

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

  • Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్‌.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd