HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Dk Aruna Will Be Appointed As Bjp Chief

తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణ? కేంద్ర మంత్రిగా బండి ప్రమోట్?

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టాలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్, బీజేపీ తమ తమ రాజకీయ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి.

  • By Praveen Aluthuru Published Date - 03:33 PM, Sat - 10 June 23
  • daily-hunt
DK Aruna
Whatsapp Image 2023 06 10 At 3.32.58 Pm

* తెలంగాణ బీజేపీలో ముసలం
* పార్టీ అధ్యక్షుడిగా బండి చాప్టర్ ముగిసినట్లేనా?
* కేంద్రంలోని బీజేపీ పెద్దలతో లాబీయింగ్ వర్కౌట్ అయినట్టేనా?
* తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా వలస మహిళ నేత?

DK Aruna: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టాలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్, బీజేపీ తమ తమ రాజకీయ వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఇక పదవిని కాపాడుకునే పనిలో అధికార పార్టీ బీఆర్ఎస్ అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవట్లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు పదవి ఆశ చూపి నేతలను తమ గూటికి చేర్చుకునే పనిలో ఉంది. ప్రస్తుతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుంది.

గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో వర్గ పోరు స్పష్టంగా కనిపిస్తున్నది. బీఆర్ఎస్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అయిన తరువాత పార్టీలో అంతర్గత పోరు మొదలైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాకా పుట్టించాయి. పేపర్ లీకేజి కేసులో బండికి మద్దతు పలకకపోవడం కాకుండా పరోక్షంగా స్పందించి పార్టీలో చీలిక రాబోతున్నట్టు సంకేతాలు పంపారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆధ్యర్వంలో పార్టీ ఎన్నికలకు వెళితే ఘోర పరాజయం తప్పదని ఇప్పటికే తెలంగాణ బీజేపీలోని ఒక వర్గం కేంద్రానికి నివేదించినట్టు తెలుస్తుంది.

కర్ణాటక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీజేపీ తమ పార్టీని పటిష్టం చేసే పనిలో పడినట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడ పార్టీ వీక్ గా ఉందో అక్కడ ప్రక్షాళన మొదలుపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం అందుతుంది. కర్ణాటక ఫలితాలతో కేంద్రం మండిపడుతుంది. ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అధికారం చేతులు మారడం ఖాయంగా భావిస్తున్నది ఢిల్లీ హైకమాండ్. ఈ నేపథ్యంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు ఎలాంటి కఠిన నిర్ణయాలు అయినా తీసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నది. ఇక తెలంగాణాలో త్వరలోనే ఆసక్తికర మార్పులు జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని తొలగించి ఆ పదవిని ఓ మహిళ నేతకు కట్టబెట్టబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని డీకే అరుణకు (DK Aruna) అప్పగించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే ప్రచార కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ (Etela Rajender) ను నియమించనున్నారట. ఇక ప్రస్తుతం బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) ను కేంద్ర మంత్రిగా ప్రమోట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు, రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్నీ వెల్లడించనున్నట్టు లీకులు అందుతున్నాయి. ఇదిలా ఉండగా బండి సంజయ్ కేంద్ర నిర్ణయంపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. ఈ మేరకు ఆయన పార్టీ ఇంచార్జ్ సునీల్ బన్సల్ కు తన నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని కాపాడుకునేందుకు బండి సంజయ్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రతిపాదనకు బండి సంజయ్ ఏ మాత్రం ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. తనకు కేంద్ర మంత్రి పదవి వద్దు అని ఇప్పటికే బండి అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు సమాచారం. అవకాశం ఇస్తే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతా..లేకపోతే ఏ పదవులు వద్దు అని స్పష్టం చేశారట. మరి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫైనల్ అయితే సంజయ్ ని ఒప్పిస్తారా? లేక తప్పిస్తారా? అనేది చూడాలి.

Read More: Telangana Politics: తెలంగాణాలో రాజకీయ రగడ మొదలుకానుందా…?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • BJP Chief Post
  • Dharmapuri Aravind
  • DK Aruna
  • Etela Rajendar
  • telangana politics

Related News

Bihar Speaker

Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

నియమాల ప్రకారం స్పీకర్ పదవికి చాలా ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి. 1985 నాటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం.. స్పీకర్ ఏ ఎమ్మెల్యేనైనా అనర్హుడిగా ప్రకటించవచ్చు.

  • Revanth Speech

    Panchayat Polls: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల దుమారం: షెడ్యూల్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్

Latest News

  • Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

  • Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

  • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

  • Rear View Mirror: బైక్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా సెట్ చేయాలి?

  • Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

Trending News

    • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

    • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd