HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Distribution Of Smart Cards To Beneficiaries Of Free Travel In Telangana

Free Bus Travel : ‘ఫ్రీ బస్ జర్నీ’ పథకంలో మరో కొత్త సౌకర్యం

మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా  తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

  • Author : Pasha Date : 01-07-2024 - 10:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
FREE BUS TRAVEL

Free Bus Travel : మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా  తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి మహిళలు ఉచితంగా బస్సులో జర్నీ చేస్తున్నారు. త్వరలోనే బస్ పాస్‌ మాదిరిగా మహాలక్ష్మి పథకం స్మార్ట్ కార్డులను మహిళలకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇతరత్రా బస్సు పాస్‌లను కూడా స్మార్ట్ కార్డులు(Free Bus Travel) మార్చాలని తెలంగాణ ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

చిల్లర సమస్యకు చెక్

బస్సు టికెట్ తీసుకునే సమయంలో చిల్లర సమస్య వస్తుంటుంది. దానికి చెక్ పెట్టేందుకుగానూ డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్‌‌ను కూడా త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని బండ్లగూడ డిపోలో ఉన్న కొన్ని బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లోనే విడతలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ డిపోల పరిధిలో ఈ పేమెంట్ విధానం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. బస్సు టికెట్ల డిజిటల్ పేమెంట్‌ కోసం ఇంటెలీజెంట్ టికెట్‌ ఇష్యూ మిషన్ పేరుతో ఐ-టిమ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. వీటిని బండ్లగూడలోని బస్సులతోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో గత మూడు నెలలుగా వాడుతున్నారు. ఐ-టిమ్స్ ద్వారా బస్సు ప్రయాణికుల నుంచి యూపీఐ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా డిజిటల్ పేమెంట్లను స్వీకరిస్తున్నారు. దీంతో ఆయా బస్సుల్లో చిల్లర సమస్య తీరిపోయింది. త్వరలోనే అన్ని బస్సుల్లోనూ ఈ విధానం అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. చిల్లర బాధకు తెరపడుతుంది.

Also Read :BRS MLCs : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ ?

జులై నెలాఖరుకల్లా ఐ-టిమ్స్

బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఆర్టీసీ రూ.10.97 కోట్లు వెచ్చించి 13వేల ఐ-టిమ్స్‌ను కొనుగోలు చేసింది. జులై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్‌ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. తొలి విడతగా పదివేల ఆర్టీసీ బస్సుల్లో ఐ-టిమ్స్‌ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read :10 Avatars : మహాశివుడి పది అవతారాల గురించి తెలుసా..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • free bus travel
  • Free Travel Beneficiaries
  • Smart Cards
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd