BJP Telangana MP List : తెలంగాణ బీజేపీలో మొదలైన అసమ్మతి సెగలు
- By Sudheer Published Date - 01:34 PM, Sun - 3 March 24

బిజెపి అధిష్టానం శనివారం మొదటి ఎంపీ లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 195 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయగా..వీరిలో 09 మంది తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు. అందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా.. నలుగురు కొత్తవారికి చోటు కల్పించింది. అయితే, మూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. హైదరాబాద్ మాధవీలత, మల్కాజ్ గిరి ఈటల రాజేందర్, జహీరాబాద్ బీబీ పాటిల్ ఎంపికపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా జహీరాబాద్ పార్లమెంట్ స్థానంకు బీబీ పాటిల్ ను ప్రకటించడం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీబీపాటిల్ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. బీజేపీలో చేరిన నెక్స్ట్ డే నే ఆ స్థానాన్ని బీబీ పాటిల్ కు బీజేపీ అధిష్టానం కట్టబెట్టింది. ఈ నియోజకవర్గం నుంచి అలె నరేంద్ర కుమారుడు అలె భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి టికెట్ ఆశించారు. కానీ, ఇద్దరిని కాదని కొత్తగా బీజేపీలోకి వచ్చిన బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వడంపట్ల పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి భాస్కర్, బాగారెడ్డి, వారి వర్గీయులు నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీబీ పాటిల్ గత పదేళ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, జహీరాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉండటంతో కేవలం టికెట్ కోసమే పాటిల్ బీజేపీలోకి వచ్చాడని అసంతృప్త నేతలు వాపోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే హైదరాబాద్ ఎంపీ స్థానంకు మాధవీలతను ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో సభ్యత్వం లేని డాక్టర్ మాధవీలతకు ఎలాటి టికెట్ కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తోపాటు నియోజకవర్గంలో ఇన్నాళ్లు పార్టీ తరపున పనిచేసిన ఉమా మహేంద్ర, పొన్నం వెంకటరమణారావు, ఉమారాణి వంటి నేతలు మాధవీలత అభ్యర్థిత్వాన్ని తప్పుపడుతున్నారు. ఓల్డ్ సిటీలో ఓవైసీకి వ్యతిరేకంగా కొన్నేళ్లుగా పోరాటం సాగిస్తున్న తమనుకాదని, కనీసం పార్టీ సభ్యత్వంలేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను బీజేపీ అధిష్టానం ప్రకటించడం పట్ల మురళీధర్ రావు పార్టీ ఫై ఆగ్రహం ఉన్నారు. పార్టీకి రాజీనామా చేందుకు కూడా ఈయన సిద్ధమయ్యారని అంటున్నారు. మొత్తం బిజెపి ప్రకటించిన మొదటి జాబితాపై అసమ్మతి సెగలు మొదలయ్యాయి.
Read Also : Allu Arjun : పుష్ప రాజ్ కొత్త లుక్ చూశారా.. కెవ్వు కేక అనేస్తున్న ఫ్యాన్స్..!