HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Deputy Cm Bhattis Key Announcement Big Decision Of The University

Deputy CM Bhatti: డిప్యూటీ సీఎం భ‌ట్టి కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఆ యూనివ‌ర్శిటీ విష‌యంలో బిగ్ డెసిష‌న్‌!

యూనివర్సిటీలో నూతనంగా నిర్మాణం చేసే భవనాలు రాబోయే తరాలకు వారసత్వ కట్టడాలుగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని, ఆ విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

  • Author : Gopi Date : 27-02-2025 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deputy CM Bhatti
Deputy CM Bhatti

Deputy CM Bhatti: దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని  తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు కావాల్సిన‌ నిధులను సమకూరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti) తెలిపారు. గురువారం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (కోటి ఉమెన్స్ కాలేజ్)ని సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న హెరిటేజ్ బిల్డింగ్స్ ను పరిరక్షణ చేయడంతో పాటు పునరుద్ధరణ చేయడానికి కావలసిన నిధులను ప్రభుత్వం ఇస్తుందని వెల్లడించారు.

మహిళా విద్యార్థులకు కావలసిన తరగతి గదులు, ల్యాబ్స్, లైబ్రరీ, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉండడానికి కావలసిన వసతి గృహాలు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయం, అతిథి గృహం, ఆడిటోరియం, పరిపాలన విభాగానికి సంబంధించిన భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రదేశాలను  పరిశీలించి, ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన భవన నిర్మాణ నమూనాలను తిలకించారు.

ఇటీవల పునరుద్ధరణ చేసిన దర్బార్ మహల్ హెరిటేజ్ బిల్డింగును పరిశీలించారు. దర్బార్ మహల్ పై అంతస్తులో 1779 – 1947 మధ్య, హైదరాబాదులో పనిచేసిన 57 మంది బ్రిటిష్ రెసిడెంట్లకు సంబంధించిన చిత్రపటాలు, వారి పదవీ కాలంలో  హైదరాబాద్ నగర రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో చేసిన అభివృద్ధికి సంబంధించి ప్రదర్శించిన చిత్రపటాలను ఆసక్తిగా తిలకించారు. పూర్వపు బ్రిటిష్ రెసిడెన్సికి సంబంధించిన చరిత్రను విజిటర్ మేనేజర్ సతీష్ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సమగ్రంగా వివరించారు.

Also Read: Central Taxes: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై రాష్ట్రాల‌కు ప‌న్ను వాటా త‌గ్గింపు?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో నూతనంగా నిర్వహించే భవనాలకు సంబంధించి రూపొందించిన నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యాశాఖ అధికారుల సమక్షంలో ఇంజనీరింగ్ అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు వివరించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న గార్డెన్స్ లో పచ్చదనాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు అందరిని ఆకట్టుకునే విధంగా మూసిని అనుసంధానం చేయడానికి తయారు చేసిన ప్రతిపాదనలను ఉప ముఖ్యమంత్రి కి చూపించారు.

యూనివర్సిటీలో నూతనంగా నిర్మాణం చేసే భవనాలు రాబోయే తరాలకు వారసత్వ కట్టడాలుగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని, ఆ విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రానా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పూజారి గౌతమి, తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి, యూనివర్సిటీ ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ సూర్య ధనుంజయ్, ప్రిన్సిపల్ లోక పావని, తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Congress Govt
  • Deputy CM Bhatti
  • hyderabad
  • koti womens college
  • telugu news
  • Veeranari Chakali Ilamma Women's University

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd