HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Create A New Industrial Corridor In Telangana Revanth Appeals To Piyush

CM Revanth: తెలంగాణకు నూతన పారిశ్రామిక కారిడార్స్ ప్లీజ్, పీయూష్ కు రేవంత్ విజ్ఞ‌ప్తి

  • Author : Balu J Date : 13-01-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Piyush
Revanth Piyush

CM Revanth: హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమ‌తులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుద‌లవుతాయ‌న్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి  విక్ర‌మార్క ఆయ‌న కార్యాల‌యంలో ఈరోజు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌ల‌ను ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గ‌త ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింద‌ని, దానిని ఉపసంహ‌రించుకొని నూత‌న ప్ర‌తిపాద‌న‌లు పంపేందుకు అనుమ‌తించాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్‌కు నేష‌న‌ల్ డిజైన్ సెంట‌ర్ (ఎన్ఐడీ) మంజూరు చేసింద‌ని, నాటి కేంద్ర మంత్రి శ్రీ ఆనంద్ శ‌ర్మ దానికి శంకుస్థాప‌న చేశార‌ని ముఖ్య‌మంత్రి, కేంద్ర మంత్రి గోయ‌ల్‌కు గుర్తు చేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఎన్ఐడీని విజ‌య‌వాడ‌కు త‌ర‌లించార‌ని, ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌కు ఎన్ఐడీ మంజూరు చేయాల‌ని కోరారు. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెద‌ర్ పార్క్ మంజూరు చేసింద‌ని కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి అన్నారు. క‌రీంన‌గ‌ర్‌, జ‌న‌గాం జిల్లాల్లో లెద‌ర్ పార్క్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూములున్నాయ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం మెగా లెద‌ర్ పార్క్ మంజూరు చేస్తే వెంట‌నే భూమి కేటాయిస్తామ‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలిపారు. ఇది మంచి ప్ర‌తిపాద‌న అని, ఇందుకు సంబంధించిన అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి స‌మావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారుల‌కు సూచించారు.

కేంద్ర ప్ర‌భుత్వం పీఎం మిత్ర ప‌థ‌కంలో భాగంగా వ‌రంగ‌ల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు బ్రౌన్ ఫీల్డ్ హోదా ఇచ్చింద‌ని, దానికి గ్రీన్‌ఫీల్డ్ హోదా ఇవ్వాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థించారు. బ్రౌన్‌ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్‌కు మార్చితే పార్క్‌కు గ్రాంట్ల రూపంలో అద‌నంగా రూ.300 కోట్ల నిధులు వ‌స్తాయ‌ని, ఇది అక్క‌డి ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. టెక్నిక‌ల్ టెక్స్ టైల్స్ (బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, క‌న్వేయ‌ర్ బెల్టులు, ఎయిర్ బ్యాగ్‌లు త‌దిత‌రాలు) టెస్టింగ్ సెంట‌ర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌న్నారు. ఈ విష‌యంలో తెలంగాణ ఇప్ప‌టికే సంసిద్ధ‌త వ్య‌క్తం చేసినందున రాష్ట్రానికి Centre of Excellence for Technical Textiles/Testing Centre మంజూరు చేయాల‌ని కోరారు. తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (IIHT) మంజూరు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో ఏడు చేనేత క్లస్టర్స్ ఉన్నాయని, ఐఐహెచ్‌టీ మంజూరు చేస్తే నేత కార్మికులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • delhi tour
  • piyush goyal
  • telangana

Related News

Telangana Govt Employees

New Law : ప్రభుత్వ ఉద్యోగులకోసం తెలంగాణ సర్కార్ కొత్త చట్టం

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగులకు గట్టి బుద్ధి చెప్పేలా, వారి జీతాల నుంచి 10 నుంచి 15 శాతం వరకు కోత విధించి, నేరుగా వారి తల్లిదండ్రులకే చెల్లించే నిబంధనతో ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు

  • Free Bus Men

    Free Bus Men in Telangana : మగవారికి ఉచిత బస్సు ప్రయాణం – తెలంగాణ సర్కార్ ఉత్తర్వూలు జారీ

  • Learning English is not a shame, it is a symbol of student empowerment: Rahul Gandhi

    Rahul : కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ

  • Apolo Tg

    తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

  • Mamnoor Airport

    Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

Latest News

  • Blenders Pride : బ్లెండర్స్ ప్రైడ్ నుండి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్

  • Escorts Kubota Limited : దక్షిణాది రైతుల కోసం ఎస్కార్ట్స్ కుబోటా సరికొత్త ట్రాక్టర్ విడుదల

  • సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

  • Mini Maldives : తెలంగాణలో మినీ మాల్దీవులు ఉన్నాయని మీకు తెలుసా ?

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

Trending News

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd