HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Party Is More Dangerous Than Cancer

Congress : కాంగ్రెస్‌ పార్టీ.. క్యాన్సర్‌ వ్యాధి కంటే ప్రమాదకరం – తోట కమలాకర్ ఎద్దేవా

Congress : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై కూడా మండిపడిన ఆయన

  • Author : Sudheer Date : 18-07-2025 - 5:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Party
Congress Party

తెలంగాణలో కాంగ్రెస్ పాలన (Congress Rule)పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌ రెడ్డి (Thota Kamalakar Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్‌ కంటే ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని గుంతల రోడ్ల రోజులకు తీసుకెళ్లుతోందని ఆరోపించారు. గ్రామాల్లో బీటీ రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారి పరిస్థితిని సరిచేయకపోతే ప్రజలు కాంగ్రెస్‌ను తీరుగా బహిష్కరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Rishabh Pant : రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధం..

బీటీ రోడ్ల మరమ్మతులపై అక్బర్‌పేట నుండి మిరుదొడ్డి మండలం కాసులాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించిన కమలాకర్ రెడ్డి, ప్రజలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతుల అవసరాలను గుర్తించకుండా, బెల్టుషాపుల ఏర్పాటుకు ముందుంటున్నారని మండిపడ్డారు. పాలనలో బాధ్యతలతో కాకుండా, మద్యం విక్రయాల మీదే ఆసక్తి చూపిస్తున్నారని విమర్శించారు.

Kitty Party Aunty : రేవంత్ రెడ్డి ని కిట్టీ పార్టీ ఆంటీతో పోల్చిన కేటీఆర్

అలాగే బీఆర్‌ఎస్‌పై నిత్యం అసత్య ఆరోపణలు చేస్తూ పరిపాలన వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తోట కమలాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై కూడా మండిపడిన ఆయన, రైతుల సమస్యలపై ఏ మాత్రం పట్టించుకోకుండా పార్టీ స్టేజులపై కూర్చోవడమే ఆయన పనిగా మారిందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు చిదుర్లు కావడంపై స్పందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన ఓటమి తెచ్చిపెడుతుందన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cancer
  • congress party
  • roads
  • Thota kamalakar reddy

Related News

Kavitha Bc Bandh

కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా , సీఎం గా గెలుస్తా అంటూ కవిత సవాళ్లు విసరడం , బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు , ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు కవిత దూకుడు బిఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైంది.

  • Cancer

    నీళ్లు తాగే విషయంలో పొరపాటు చేస్తే క్యాన్సర్ వ‌స్తుందా?!

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Telangana Cheyutha Pension

    రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రూ.4 వేల చేయూత పెన్షన్ పెంపు!

  • Ktr Grampanchayithi

    అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు ఇక కాలం చెల్లింది – కేటీఆర్

Latest News

  • విటమిన్​ బి12 లోపం లక్షణాలు ఇవే!

  • లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

  • జనవరి 13 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘కైట్ ఫెస్టివల్’

  • రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం! అసలు VB-G RAM G బిల్లు అంటే ఏంటి ?

  • ముచ్చటగా మూడోసారి మలైకా డేటింగ్, ఈసారి ఏకంగా తన కంటే 17 ఏళ్ల చిన్నోడితో ?

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd