HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Compares Revanth Reddy To Kitty Party Aunty

Kitty Party Aunty : రేవంత్ రెడ్డి ని కిట్టీ పార్టీ ఆంటీతో పోల్చిన కేటీఆర్

Kitty Party Aunty : ‘‘కిట్టీ పార్టీ ఆంటీలా చెవులు కొరికే మాటలు మాట్లాడి మీడియా మేనేజ్‌మెంట్ చేయాలనుకోవడం నీచతనం. ఆధారాలుంటే బయట పెట్టు, లేదంటే బురద జల్లే పనులు మానుకో’’ అని హెచ్చరించారు

  • Author : Sudheer Date : 18-07-2025 - 5:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Km
Ktr Km

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం లో మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా “కిట్టీ పార్టీ ఆంటీ” (Kitty Party Aunty) లాగే వ్యవహరిస్తున్నాడంటూ విరుచుకుపడ్డారు. రేవంత్‌ వద్ద ఆధారాలు లేక చీకట్లో చిట్‌చాట్‌లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం హోదాలో ఉండి ఇటువంటి చిల్లర మాటలతో వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపర్చడమేనని అన్నారు.

Pawan Kalyan: జ‌న‌సేనాని కీల‌క నిర్ణ‌యం.. కూట‌మిలో టీడీపీ ఆధిపత్యానికి చెక్?!

“జూబ్లీహిల్స్ ప్రాంతంలో మధ్యాహ్నం డబ్బున్న మహిళలు కిట్టీ పార్టీలు చేస్తారు, రేవంత్ కూడా అలాంటి వారిలాగే మాట్లాడుతున్నాడు. ఎవడు ఎక్కడో అన్న మాటల్ని నిజంగా నమ్మి, పది మందిని పోగేసుకుని చిట్ చాట్ పేరిట చిల్లర మాటలు మాట్లాడే స్థాయికి దిగజారాడన్నది ప్రజలకు స్పష్టమవుతోంది” అని విమర్శించారు. ఆధారాలు ఉంటే బయట పెట్టమని, లేదంటే చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ‘‘నువ్వే సీఎం, నువ్వే హోంమంత్రి అయితే దొంగల మాదిరి చీకట్లో కూర్చోకుండా నిజాలను బయటపెట్టు’’ అని సవాల్ చేశారు.

Rishabh Pant : రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధం..

దుబాయ్‌లో ఎవరో చనిపోతే దాన్ని తనపై మోపడం సిగ్గుచేటన్నారు. ‘‘శవాల మీద పేలాలు ఏరుకునే నీ స్థాయికి నీవు దిగజారావా?’’ అని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉండి ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని అన్నారు. ‘‘కిట్టీ పార్టీ ఆంటీలా చెవులు కొరికే మాటలు మాట్లాడి మీడియా మేనేజ్‌మెంట్ చేయాలనుకోవడం నీచతనం. ఆధారాలుంటే బయట పెట్టు, లేదంటే బురద జల్లే పనులు మానుకో’’ అని హెచ్చరించారు. రేవంత్ గతంలో తనపై చేసిన వ్యాఖ్యలపై కోర్టులో దాఖలు చేసిన కేసును గుర్తు చేసిన కేటీఆర్, కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్‌ను స్టే అని చెప్పే స్థాయికి ఆయన దిగజారాడని విమర్శించారు. ‘‘ఇంజెక్షన్ ఆర్డర్, స్టేలో తేడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ప్రజాస్వామ్యానికి శాపంగా మారుతోంది. గౌరవంగా ఉండే పదవిని ఇలా అవమానించకూడదు’’ అని కేటీఆర్ హితవు పలికారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm revanth
  • Kitty Party Aunty
  • ktr
  • KTR khammam Tour
  • KTR Kitty Party Aunty

Related News

Ktr Velugumatla Demolition

Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • There Will Be No Urea Probl

    Urea Shortage : రైతులకు గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇకపై యూరియా కష్టాలు ఉండవు !!

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd