Congress Vs KTR : రైతు ఆత్మహత్యలపై కేటీఆర్ రాద్ధాంతం.. నగ్న సత్యాలతో కాంగ్రెస్ కౌంటర్
అంతేకాదు.. బీఆర్ఎస్ పాలనా కాలంలో తెలంగాణలో జరిగిన రైతు ఆత్మహత్యలపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాల క్లిప్‌లను తన ట్వీటుకు కోట నీలిమ(Congress Vs KTR) జోడించారు.
- By Pasha Published Date - 09:06 PM, Sun - 19 January 25

Congress Vs KTR : రైతు ఆత్మహత్యల అంశం ఇప్పుడు తెలంగాణలో రాజకీయ కాకను రాచేస్తోంది. దీనిపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఆదిలాబాద్‌లో జరిగిన గిరిజన రైతు జాదవ్ దేవ్‌రావ్ ఆత్మహత్య అంశాన్ని కాంగ్రెస్‌కు అంటగట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ(ఆదివారం) యత్నించారు. ఆయన ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కోట నీలిమ వెంటనే బలమైన ఆధారాలతో తిప్పికొట్టారు. కేవలం ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయడానికి కేటీఆర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యల సంక్షోభాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పాలనా కాలంలో తెలంగాణలో జరిగిన రైతు ఆత్మహత్యలపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాల క్లిప్‌లను తన ట్వీటుకు కోట నీలిమ(Congress Vs KTR) జోడించారు. అన్నదాతల సూసైడ్స్ వివరాలతో 2015 సెప్టెంబరు 9న, 2017 జూన్ 22న, 2019 ఆగస్టు 2న, 2020 సెప్టెంబరు 2న వివిధ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల క్లిప్స్ అందులో ఉన్నాయి.
Never speak about #FarmerSuicides @KTRBRS; it is a painful legacy left behind by BRS party misrule in Telangana.
To wash off guilt, BRS Govt had even suppressed data, exposed by activists. Farm distress had worsened due to vision-less arbitrary decisions of BRS top leaders, and… https://t.co/QQkuTVNjCS pic.twitter.com/Qi1KraePJC
— Kota Neelima కోట నీలిమ (@KotaNeelima) January 19, 2025
Also Read :US President Powers : అమెరికా ప్రెసిడెంట్‌కు ఉండే పవర్స్ గురించి తెలుసా ?
“ఏదైనా రాజకీయ పార్టీ రైతుల గురించి ఆలోచిస్తోంది అంటే.. అది కాంగ్రెస్ మాత్రమే. గత చరిత్రను చూసినా ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పేదలు, రైతులకు వ్యతిరేకం. ధనికులకు అనుకూలంగా వ్యవహరించడమే బీఆర్ఎస్ పని. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక కేటీఆర్ అడ్డదిడ్డమైన ట్వీట్లు చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ మండిపడ్డారు. పేదలకు అనుకూలమైన విధానాలను అర్థం చేసుకునే స్థితిలో బీఆర్ఎస్ లేదన్నారు.
Watch this video Mr @RahulGandhi
This CCTV footage of a private bank in Adilabad, Telangana is a gut wrenching testament of your failed governance!
This is day light murder of a Telangana farmer by your Congress government.
Jadav Devrao, a 50 year old tribal farmer, broken by… pic.twitter.com/lkTpzC1zlK— KTR (@KTRBRS) January 19, 2025
Also Read :US President Vs World Leaders : అమెరికాను మించిన రేంజులో ఈ దేశాధినేతలకు శాలరీలు
ఇటీవలే జరిగిన ఓ రైతు ఆత్మహత్య కేసును హైలైట్ చేస్తూ రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి మరీ కేటీఆర్ ట్వీట్ చేయడాన్ని నీలిమ తప్పుపట్టారు. రైతులకు వాగ్దానం చేసిన రుణమాఫీ హామీ నెరవేరలేదని అనవసర చర్చకు కేటీఆర్ తెరతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనా కాలంలో రైతు ఆత్మహత్యలను ఆపలేకపోయిన బీఆర్ఎస్‌కు.. రైతు సంక్షేమం గురించి మాట్లాడే అర్హతే లేదని ఆమె పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునే అంశంపై కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.