HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Guarantee Undermining Brs

Congress : బీఆర్ఎస్‌ను కుదిపేస్తున్న కాంగ్రెస్ “గ్యారెంటీ”

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు "గ్యారంటీ"

  • Author : Prasad Date : 05-07-2023 - 7:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress BRS
Congress BRS

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు “గ్యారంటీ” చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. సీఎల్పీ నేత భట్టి పాద‌యాత్రతో మొదలై.. ఖమ్మంలో తుఫాను గా మారిన కాంగ్రెస్ ప్రభంజనం ఇప్పుడు “గ్యారెంటీ ” తో అధికారం దిశగా దూసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన చేయూత పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ప్రకటించిన చేయూత బీఆర్ఎస్ కోటను కదిలించింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ నే టార్గెట్‌గా చేస్తుంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటన చేసారు. ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్‌ బాదితులు, డయాలసిస్‌ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్‌ అందిస్తామని తెలిపారు. అక్కడ ఫార్ములానే ఇక్కడ అమలు చేయటానికి రాహుల్ నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి నుంచి తాము అందిస్తున్న పెన్షన్ ..సంక్షేమం పైన భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయినా అమలులో మాత్రం భారీగా వైఫల్యం కనిపిస్తోంది. ఈ సమయంలో రాహుల్ చేసిన ప్రకటన పైన పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఓట్ల వర్షం కురిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీలో కొర్రీలు..ఆలస్యం..సక్రమంగా లేని అమలు వంటి వాటితో లబ్దిదారులు విసుగు చెందారు. కర్ణాటకలో అమలు చేస్తున్న తరహా విధానం ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రూ 75 ఉన్న పెన్షన్ ను రూ 200 కి పెంచి అమలు చేసి నమ్మకం నిలబెట్టుకుంది. తిరిగి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్.. అందునా రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటన చేయటంతో ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలకు మేలు చేయనుంది. ఫలితంగా పార్టీకి ప్రయోజనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CLP leader Bhatti Vikramarka
  • congress
  • rahul gandhi
  • telangana
  • tpcc chief revanth

Related News

    Latest News

    • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

    • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

    • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

    • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

    • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd