Telangana: కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)కి ఫిర్యాదు చేసింది . కేటీఆర్ ప్రజలను ప్రలోభపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాలస్వామి.
- Author : Praveen Aluthuru
Date : 11-10-2023 - 6:27 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)కి ఫిర్యాదు చేసింది . కేటీఆర్ ప్రజలను ప్రలోభపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాలస్వామి. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాల్సిందిగా కేటీఆర్ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని వేణుగోపాలస్వామి సీఈసీని కోరారు. మూడు రోజుల్లో చర్యలు తీసుకోకుంటే రిట్ పిటిషన్ వేస్తామని హెచ్చరించారు.ఇటీవల ఓ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు కుంభకోణాలకు పాల్పడ్డారని, బాగా డబ్బు సంపాదించారని, వాటితో ఓట్లు కొనుక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకున్నా కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.
Also Read: Elections 2023: కామారెడ్డిలో రూ.2.40 లక్షల నగదు స్వాధీనం