HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cold Wave Intensifies In Telangana Health Precautions

Cold Wave : తెలంగాణ వాసులకు అలర్ట్‌.. ఈ ఐదు రోజులు జర భద్రం..

Cold Wave : తెలంగాణలో చలికాలం తీవ్రంగా పెరిగింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువకు వచ్చాయి. ప్రజలు చలిని తట్టుకునేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణ కేంద్రం అధికారులు రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

  • Author : Kavya Krishna Date : 06-01-2025 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cold Wave
Cold Wave

Cold Wave : తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువకు వచ్చాయి. ప్రజలు చలిని తట్టుకునేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే.. వాతావరణ కేంద్రం అధికారులు రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత వారం వరకు హైదరాబాద్ లో 17-30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండగా, ప్రస్తుతం 13 డిగ్రీలకు దిగువకు పడిపోయాయి. ఈ చలిని ఉత్తర గాలుల ప్రభావం పెంచినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు, ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

CM Revanth: తెలుగువారి హ‌వా తగ్గింది.. సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

తూర్పు గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో చలిని పెంచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గే అవకాశముందని అంచనా వేసింది. ఈ చలిలో ఆరుగురు ప్రధాన నగర జోన్లలో ఉదయం పొగమంచు ఉంటుందని పేర్కొంది. అయితే.. ఈ చలి తీవ్రత పెరగడంతో ఉదయాన్నే పనులను వెళ్లేవారు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.

ప్రజలు క్షేమంగా ఉండేందుకు, ప్రజలకు సలహా ఇవ్వడంలో డాక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ చలిలో అలర్జీ, వైరల్‌ వ్యాధులు, జలుబు, దగ్గు, తుమ్ములు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అలాగే, ఫంగస్‌, డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువులు, పుప్పొడి వంటివి ఆస్తమా సమస్యలను ప్రేరేపిస్తాయని, ఈ దిశలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు ఆరోగ్యానికి హానికరమైన ఈ పరిస్థితి నుండి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Attack On Pak Army : పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై సూసైడ్ ఎటాక్.. 47 మంది సైనికులు మృతి ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allergies
  • asthma
  • cold wave
  • health Precautions
  • hyderabad
  • telangana
  • temperature drop
  • viral diseases
  • weather
  • Weather Warnings

Related News

Zepto

Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

హైదరాబాద్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న జెప్టో (Zepto) వేర్‌హౌస్‌పై ఫుడ్ సెప్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో గడువు ముగిసిన పలు ఆహార ఉత్పత్తులను స్వాధీనం చే

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd