Co-Living : హైదరాబాద్ లో విస్తరిస్తున్న కో-లివింగ్ సంస్కృతి
Co-Living : ఈ విధంగా హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
- By Sudheer Published Date - 09:45 AM, Tue - 18 March 25

ఇటీవల హైదరాబాద్‌లో కో-లివింగ్ (Co-Living) అనే కొత్త సంస్కృతి విస్తరిస్తోంది. ఇది ముఖ్యంగా యువత, ఐటి ఉద్యోగులు, విద్యార్థుల కోసం అందుబాటులోకి వచ్చిన ఒక ఆప్షన్. మాములు హాస్టళ్ళతో పోలిస్తే కో-లివింగ్ స్పేస్‌లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిలో వ్యక్తిగత గదులు, షేర్ చేసే వంటగదులు, వర్క్ స్పేస్‌లు, హైస్పీడ్ ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఇదొక కమ్యూనిటీ బేస్డ్ లివింగ్ మోడల్.
Astronauts Daily Routine: స్పేస్‌లో వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుంది ?
కానీ ఇటీవల కొందరు కో-లివింగ్ హాస్టల్ (Co-Living Hostels) యజమానులు ఈ కాన్సెప్ట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు. “అమ్మాయిని మీరు తీసుకురావచ్చు, లేకపోతే మేమే ఏర్పాట్లు చేస్తాం” అంటూ వివాదాస్పద ప్రకటనలు ఇస్తున్నారు. ఒకే గదిలో అబ్బాయి, అమ్మాయి కలిసుంటూ కో-లివింగ్ చేయవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఈ తరహా ప్రకటనలు యువతను ఆకర్షించే విధంగా ఉన్నప్పటికీ, సమాజంలో నైతిక విలువలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
Titanium Heart : టైటానియం గుండె వచ్చేసింది.. 105 రోజులుగా బతుకుతున్న హృద్రోగి
ఇంకా విచిత్రం ఏమిటంటే కొన్ని కో-లివింగ్ హాస్టల్ (Co-Living Hostels) యజమానులు “పోలీసులే మా పార్టనర్లు” అని అంటున్నారు. వారు తమ వ్యాపారాన్ని రక్షించడానికి, ప్రభుత్వ యంత్రాంగంతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నామని చెబుతున్నారు. ఈ విధంగా హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పెరుగుతున్న కో-లివింగ్ సంస్కృతి నిజంగా అవసరమైనదా లేక యువతను తప్పుదారి పట్టించే మరో వ్యాపారమా అనే దానిపై నిపుణులు చర్చిస్తున్నారు.