HYD : సీఎం రేవంత్ వ్యూహం ఇదేనా..? అందుకే గ్రేటర్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టాడా..?
2026లో రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరగబోతుంది. జనాభా ప్రాతిపాదికన ఇవి జరగనుండగా… మెజారిటీ సీట్లు కొత్తగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోనే రాబోతున్నాయట
- By Sudheer Published Date - 02:50 PM, Sat - 13 July 24

రోజు రోజుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) దూకుడు మరింత పెంచుకుంటూపోతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటే ఇప్పుడు మరింత ఆలోచనతో ముందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీల నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఓ పక్క పాలనా ఫై ఫోకస్ చేస్తూనే మరోపక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs)తో సంప్రదింపులు చేస్తూ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హావ స్పష్టంగా కనిపిస్తే..గ్రేటర్ లో మాత్రం కారు హావ నడిచింది. దీంతో గ్రేటర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫై ఫోకస్ చేసాడు రేవంత్. వరుస పెట్టి ఆఫర్లు ప్రకటిస్తూ వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నాడు. ఇప్పటీకే దానం నాగేందర్ , ప్రకాష్ గౌడ్ , అరికపూడి గాంధీ వంటి వారు చేరగా ..మరికొంతమంది గ్రేటర్ ఎమ్మెల్యేలు చేరేందుకు ముహుర్తాలు ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. ఇలా గ్రేటర్ ఎమ్మెల్యేల ఫై సీఎం రేవంత్ ఫోకస్ చేయడం వెనుక భారీ వ్యూహం ఉందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
2026లో రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరగబోతుంది. జనాభా ప్రాతిపాదికన ఇవి జరగనుండగా… మెజారిటీ సీట్లు కొత్తగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోనే రాబోతున్నాయట. ప్రస్తుతం 24 సీట్లు గ్రేటర్ పరిధిలో ఉంటే… వాటి సంఖ్య 54కు చేరనుందని, భవిష్యత్ లో గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు వచ్చిన వారే అధికారాన్ని చేపడతారని అంచనాకు సీఎం రేవంత్ వచ్చారట. అందుకే గ్రేటర్ ఫై ఎక్కువ ఫోకస్ చేసి మూసీ సుందరీకరణ, ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను గ్రేటర్ కిందకు తీసుకరావటం వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుస బిఆర్ఎస్ నేతలు చేరడం తో స్థానిక కాంగ్రెస్ నేతలు కాస్త ఆగ్రహం తో ఉన్నప్పటికీ వారికీ కూడా రేవంత్ హామీ ఇస్తున్నాడట. మీ సీటుకు ఢోకా ఉండదు… అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. కలిసి పనిచేసుకోండి… మళ్లీ అవకాశం వస్తుందని పాత ఇంచార్జులకు చెపుతున్నాడట. మొత్తం రేవంత్ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారని అంత మాట్లాడుకుంటున్నారు. మరి వీరి చేరిక వల్ల కాంగ్రెస్ కు ఎంత ఉపయోగం ఉంటుందో చూడాలి.
Read Also : Gautam Gambhir: మూడు ఫార్మెట్లో ఫిట్నెస్ తప్పనిసరి: గంభీర్