HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddys Interesting Tweet On Warangal Visit

Warangal : వరంగల్‌ పర్యటనపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికర ట్వీట్‌

వరంగల్ వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ – దిశ మార్చేందుకు ఈరోజు నేను వస్తున్నానని ట్వీట్ లో సీఎం రేవంత్‌ రెడ్డిపేర్కొన్నారు.

  • Author : Latha Suma Date : 19-11-2024 - 3:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth
CM Revanth

CM Revanth Reddy : కాంగ్రెస్‌ ప్రభుత్వం “ప్రజాపాలన-విజయోత్సవాలు”పేరుతో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. అయితే వరంగల్ బయలుదేరడానికి ముందు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తెలంగాణ ఛైత‌న్య‌పు రాజ‌ధాని అని ఓరుగ‌ళ్లును కొనియాడారు. కాళోజీ నుండి నరసింహారావు వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల‌ని చెప్పారు. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జ‌యశంకర్ సారుకు జన్మనిచ్చిన గడ్డ అని తెలిపారు. హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క, సారలమ్మలు నడయాడిన ప్రాంతమ‌ని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రమ‌ని తెలిపారు. వరంగల్ వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ – దిశ మార్చేందుకు ఈరోజు నేను వస్తున్నానని ట్వీట్ లో సీఎం రేవంత్‌ రెడ్డిపేర్కొన్నారు.

కాగా, తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తైంది. ప్ర‌జాపాల‌న‌తో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వ స‌భ‌ను వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ పై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో ఓ ట్వీట్ చేశారు.

ఇకపోతే.. సీఎం ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వ‌రంగ‌ల్ లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేస్తున్నారు. గతంలో ఎన్న‌డూ లేని విధంగా వ‌రంగ‌ల్ హ‌న్మ‌కొండ‌ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. 2040 టార్గెట్ గా వ‌రంగ‌ల్ అభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్మించనున్న 22 మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో పది జిల్లాలో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మిగిలిన జిల్లాల్లో కొత్తగా నిర్మించనున్నారు. ఎంజీఎంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌నూ ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేస్తారు. అనంతరం విజయోత్సవ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

Read Also: Mens Day 2024 : కవితను చదివి వినిపించిన మహేశ్‌ బాబు.. ‘మెన్స్‌ డే’ ప్రత్యేక పోస్ట్‌

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • cm warangal tour
  • congress
  • Kaloji Narayana Rao
  • Praja Palana Vijayotsavam

Related News

Discussions In Telangana Congress On Rajya Sabha Vacancies

రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్‌లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?

ఈ రెండు ఖాళీలకు సంబంధించిన నామినేషన్లు మార్చి 5లోపు దాఖలు చేయాల్సి ఉండటంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

  • Virosh Wedding

    ఉదయ్‌పుర్‌ బయల్దేరిన విజయ్‌, రష్మిక

  • Jangaon Thorrur Congress

    లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd