IAS Vs 57 Transfers: 34 ఏళ్లలో 57 ట్రాన్స్‌ఫర్లు.. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా రిటైర్మెంట్
అశోక్ ఖేమ్కా(IAS Vs 57 Transfers) 1965లో కోల్‌కతాలో జన్మించారు.
- By Pasha Published Date - 01:09 PM, Wed - 30 April 25

IAS Vs 57 Transfers: ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి.. ఈరోజే(ఏప్రిల్ 30న) రిటైర్ అయ్యారు. తన 34 సంవత్సరాల కెరీర్‌లో ఏకంగా 57 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. నిజాయితీగా, నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయన్ను ప్రభుత్వాలు భరించలేకపోయాయి. అందుకే ఇన్నిసార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అత్యధిక ట్రాన్స్‌ఫర్లతో దేశంలోనే గుర్తింపు పొందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చివరిసారిగా 2024 డిసెంబరులో హర్యానాలో రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇవాళే పదవీ విరమణ పొందారు. అశోక్ ఖేమ్కా కెరీర్‌లోని కీలక మలుపుల గురించి తెలుసుకుందాం..
Also Read :Meta AI App : ‘మెటా ఏఐ’ యాప్ వచ్చేసింది.. ఫీచర్లు ఇవీ
ఐఏఎస్ అశోక్ ఖేమ్కా కెరీర్ సాగిందిలా..
- అశోక్ ఖేమ్కా(IAS Vs 57 Transfers) 1965లో కోల్‌కతాలో జన్మించారు.
- ఈయన 1988లో ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పట్టా పొందారు.
- తదుపరిగా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు.
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్లతో ఎంబీఏ పట్టా పొందారు.
- పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి LLB చేేశారు.
- అశోక్ ఖేమ్కా 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
- ఈయన హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి.
- అశోక్ కెరీర్‌లో మొత్తం 57సార్లు బదిలీ అయ్యారు. అంటే సగటున ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
- 2012లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాతో ముడిపడి ఉన్న గురుగ్రామ్ భూ ఒప్పందాన్ని అశోక్ ఖేమ్కా రద్దు చేశారు. దీంతో జాతీయ స్థాయిలో ఆయన పేరు ఫేమస్ అయ్యింది.
- గత 12 సంవత్సరాలలో అశోక్ ఖేమ్కాకు ‘లో-ప్రొఫైల్’ గా పరిగణించబడే శాఖల బాధ్యతలను అప్పగించారు.
- 2013లో ఒకసారి కాంగ్రెస్ హయాంలో, తదుపరిగా బీజేపీ పాలనా కాలంలో మూడుసార్లు ఆర్కైవ్స్ విభాగానికి అశోక్ ఖేమ్కా బదిలీ అయ్యారు. ఆర్కైవ్స్ విభాగం అనేది ‘లో-ప్రొఫైల్’ శాఖ. అందులో భారీ నిధుల వ్యవహారాలు కానీ, కీలక నిర్ణయాలు కానీ నిరంతరం జరగవు.
Also Read :Taj Mahal Camouflage : భారత్ – పాక్ ఘర్షణ.. తాజ్‌మహల్‌పై ‘గ్రీన్ కాముఫ్లేజ్’.. ఎందుకు ?
నిలువుగా ఉన్న చెట్లనే ముందుగా నరికేస్తారు : అశోక్ ఖేమ్కా
రెండేళ్ల క్రితం ఐఏఎస్ అధికారుల పదోన్నతుల జాబితా విడుదలైన తర్వాత అశోక్ ఖేమ్కా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘భారత ప్రభుత్వానికి కొత్తగా కార్యదర్శులుగా నియమితులైన నా బ్యాచ్‌మేట్‌లకు అభినందనలు. ఇది ఆనందించడానికి ఒక సందర్భమే అయినప్పటికీ.. ఒకరు వెనుకబడిపోయారనే నిరాశను కూడా అంతే స్థాయిలో తెస్తుంది’’ అని ఆయన రాసుకొచ్చారు. ‘‘నిలువుగా ఉన్న చెట్లను ఎల్లప్పుడూ ముందుగా నరికేస్తారు. అయినా నాకు ఎలాంటి విచారం లేదు. నేను కొత్త సంకల్పంతో, పట్టుదలతో ఉంటాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.