HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Meeting With Collectors Postponed

CM Revanth Reddy: కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం వాయిదా.. కారణమిదే..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉన్నారు.

  • Author : Gopi Date : 21-12-2023 - 11:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
Revanth Sonia

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా ఇటు ప్రభుత్వ విధులు.. అటు పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే పని నిమిత్తం ఢిల్లీ, హైదరాబాద్ లకు తరచూ ప్రయాణం చేస్తున్నారు. బుధవారం ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన సీఎం గురువారం మళ్లీ ఢిల్లీకి పయనం కానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తో పాటు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇంత బిజీ షెడ్యూల్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశం వాయిదా పడింది. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్షలో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోవాలని సీఎం భావించారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై జిల్లా పాలనాధికారులు అందరూ తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. వారంతా ఆ మేరకు సిద్ధమయ్యారు.

Also Read: China Earthquake: భూకంపం గురించి చైనాకు ముందే తెలుసా..? శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..?

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సమావేశం వాయిదా పడినట్లు కలెక్టర్లకు సమాచారం అందింది. ఓవైపు శాసనసభ సమావేశాలు ఉండటం, మరోవైపు నేడు ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానుండడం వల్ల కలెక్టర్ల సమీక్షా సమావేశానికి రేవంత్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. దింతో కలెక్టర్లతో సమావేశం వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • delhi
  • hyderabad
  • telangana
  • TS Collectors

Related News

Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో రాజేశ్వరి అనే వివాహిత అదృశ్యమైంది. ఆమెను భర్త శివకుమార్ ‘పెరుగు తింటే లావు అవుతావు’ అని అన్నందుకు మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్త సరదాగా అన్న మాటలను రాజేశ్వరి సీరియస్‌గా తీసుకుని ఎవరికీ చెప్పకుండా అదృశ్యమైంది. దీంతో ఆమె కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుక

  • Cm Revanth Mptc Zptc

    Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

Latest News

  • Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

  • Coke Studio India : కోక్ స్టూడియో నుండి బుల్లెయా వే సాంగ్

  • Godrej Agrovet : లక్ష మంది మహిళా నిపుణులే లక్ష్యంగా గోద్రెజ్ ‘దిశ’

  • Women’s Reservation Bill : దేశ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ చంద్రబాబు ఆవేదన

  • Rashmika : రోజుకు 8 గంటలు..వామ్మో ఏంటి రష్మిక ఇది !!

Trending News

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd