Telangana Bhavan : తెలంగాణ భవన్ గేటు వద్ద సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దహనం
Telangana Bhavan : "సీఎం రేవంత్ డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు
- Author : Sudheer
Date : 19-12-2024 - 8:34 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ భవన్ (Telangana Bhavan) ప్రధాన గేటు వద్ద సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-కారు రేసింగ్ (Formula E Car Race Case) వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS Workers) నినాదాలు చేశారు. “సీఎం రేవంత్ డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను A1గా, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను A2గా, బీఎల్ఎన్ రెడ్డిని A3గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగిందన్న అభియోగాలు నేపథ్యంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13(1A), 13(2), 409, 120B సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల కేటీఆర్‌పై విచారణకు అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. ఈ చర్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై కేటీఆర్ శాసనసభ వేదికగా స్పందించారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చకు తెస్తే పూర్తి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. “ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి” అని ప్రభుత్వం ముందు సవాల్ విసిరారు.
Read Also : KTR Case : అక్రమ కేసులతో మా గొంతు నొక్కలేరు : ఎమ్మెల్సీ కవిత