HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kavitha Tweet On Ktr Case

KTR Case : అక్రమ కేసులతో మా గొంతు నొక్కలేరు : ఎమ్మెల్సీ క‌విత‌

అక్ర‌మ కేసుల‌తో మా గొంతుల‌ను నొక్క‌లేరని వెల్లడించారు. చిల్లర వ్యూహాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం అవివేకం అని ఆమె తెలిపారు.

  • Author : Latha Suma Date : 19-12-2024 - 7:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mlc Kavitha
Mlc Kavitha

KTR Case : ఫార్ములా-ఈ కార్‌ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అధినేత కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. అక్ర‌మ కేసుల‌తో మా గొంతుల‌ను నొక్క‌లేరని వెల్లడించారు. చిల్లర వ్యూహాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం అవివేకం అని ఆమె తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టామని అన్నారు. మీ చిల్ల‌ర‌ వ్యూహాలు మమ్మల్ని భయపెట్టవు.. అవి మా సంకల్పానికి మ‌రింత బ‌లం చేకూరుస్తాయని అన్నారు.

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని కవిత అన్నారు. మేమంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ సైనికులమనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి అక్రమంగా కేసులు పెడుతూ మీరు చేస్తున్న ప్రయత్నాలు మమ్మల్ని భయపెట్టలేవు. మేం మరింత బలపడతాం. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక కేటీఆర్‌పై అక్రమంగా, కక్షపూరిత కేసులు పెడుతున్నారని కవిత అన్నారు. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తెలంగాణ స్ఫూర్తి గెలుస్తుంది అని కవిత అన్నారు. జై తెలంగాణ ! జై జై తెలంగాణ !! అని క‌విత పేర్కొన్నారు.

కాగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. 13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా నాలుగు సెక్షన్ల కింద కేటీఆర్‌పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఫార్ముల్ ఈ- రేసింగ్ కేసులో.. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇండనీర్ బీఎల్ఎస్ రెడ్డిగా ఏసీబీ పేర్కొంది.

Read Also: ChatGPT On Whatsapp: వాట్సాప్‌లోనూ ‘ఛాట్ జీపీటీ’.. ఎలా వాడుకోవాలో తెలుసా ?

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Formula E Car Race
  • Hyderabad Formula E Race Cas
  • kavitha
  • ktr
  • KTR Case

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd