HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Reddy Chit Chat With Media

CM Revanth Reddy : ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళతో సఖ్యతగా ఉంటాం

నిన్నటి వరకు ఎన్నికల హడావిడిలో మునిగిపోయిన అధికార యంత్రాంగం ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మీడియా చిట్ చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

  • By Kavya Krishna Published Date - 10:14 PM, Tue - 14 May 24
  • daily-hunt
Cm Revanth (2)
Cm Revanth (2)

నిన్నటి వరకు ఎన్నికల హడావిడిలో మునిగిపోయిన అధికార యంత్రాంగం ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మీడియా చిట్ చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర రావు ఎవరో తనకు తెలియదని కేసీఆర్ అంటున్నారని… కానీ ఈ కేసులో ఆయన ఉన్నట్లు కూడా తనకు తెలియదని ఎద్దేవా చేశారు.

ఫోన్ ట్యాపింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడించారు. రేసింగ్ కేసులో నిధుల గోల్ మాల్‌పై విచారణ జరుగుతోందన్నారు.
అకస్మిక తనిఖీలు, పర్యటనలు ఉంటాయని తెలిపారు. మూసీ నదిని ఆదాయ వనరుగా మారుస్తామన్నారు. త్వరలో బ్యాంకర్లతో సమావేశమవుతామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై చర్యల చేపడతామన్నారు. రైతుల రుణాల మాఫీ కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అన్ని హాస్టళ్లకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ఎన్నికలు ముగియగానే రేపటి నుంచి పాలనపై దృష్టి సారిస్తామన్నారు. హామీల అమలుపై సమీక్ష చేస్తామన్నారు. రైతు రుణమాఫీపై, గిట్టుబాటు ధర, విద్యా శాఖపై దృష్టి పెడతామన్నారు. ధరణిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేస్తున్నామన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు.

ఎన్నికలు ముగిశాయి. ఇక నా దృష్టి అంతా పరిపాలన పైనే అని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 13 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్ ఎలక్షన్ ఎలా చేసిందనే దానిని బట్టి రిజల్ట్ ఉంటుందన్నారు. ఎవరి ఓట్లు వాళ్లు వాళ్లు తీసుకుంటే ఎలక్షన్ అంచనా వేయవచ్చు అని ఆయన అన్నారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ 20 వేల మెజారిటీ తో గెలుస్తుందని, బీజేపీకి మొత్తం 210 దాటేలా లేదన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. రేపటి నుంచి పరిపాలన పై పూర్తిగా దృష్టి పెడుతాం. ధాన్యం కొనుగోలు రుణమాఫీ పై దృష్టి పెడతామని, స్కూల్ లు ఓపెన్ అవుతాయి కాబట్టి వాటిపై దృష్టి పెడుతామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

అసెంబ్లీ లో చర్చ చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. లేదంటే అఖిలపక్షం పెడుతామని సీఎ రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. రేషన్ షాప్ లలో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి పంచుతామని ఆయన స్పష్టం చేశారు. సామాన్యులు కొనుగోలు చేసే 9 వస్తువులు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇస్తామని, రేషన్ షాప్ లలో సన్న బియ్యం ఇస్తామని సీఎ రేవంత్‌ పేర్కొన్నారు. రుణమాఫీ కోసం FRBM పరిధిలో లోన్ తీసుకుంటామని, ఇక రాజకీయం ముగిసింది. రాష్ట్రములో నా దృష్టి పూర్తిగా పరిపాలన పై పెడుతామని ఆయన తెలిపారు. విమర్శకులు ఏం అనుకున్న నేను పట్టించుకొనని కౌంటర్‌ ఇచ్చారు.

రైతుబంధు కూడా పూర్తి చేయరు అన్నారు. చేశాక అది మా క్రెడిట్ అంటున్నారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. రెండో సారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆ క్రెడిట్ వారే తీసుకోమని సెటైర్‌ వేశారు సీఎం రేవంత్‌. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రజలకు ఇస్తామని,
స్టేట్ కు ఏం కావాలో వాటిని లిస్ట్ చేసుకొని రైతుల నుంచి వచ్చేలా చూస్తామని.. రైతులకు శుభవార్త చెప్పారు. కరెంట్ విషయంలో కావాలనే కొందరు అధికారులు తప్పుడు విధానాలు చేస్తున్నారని, హరీష్ రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశాడని ఆయన విమర్శించారు.

ఎన్నికల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూశారని, కొన్ని గుర్తించాం కేసులు కూడా కొన్ని నమోదు అయ్యాయని, ప్రభుత్వం, విద్య, వైద్యం, వ్యవసాయం పై దృష్టి పెట్టామని ఆయన వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యూనివర్సిటీ లకు కొత్త వీసీ లను నియమిస్తామని, రేపటి నుంచి సచివాలయంకు వెళ్తామన్నారు. తడిసిన ధాన్యం విషయం లో వెంటనే చర్యలు తీసుంటామని, ఆకస్మిక తనిఖీలు కూడా ఇక నుంచి ఉంటాయన్నారు. గోదావరి జలాలను హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ కు రెగ్యులర్ గా వచ్చేలా చేస్తామని, ఫార్మా సిటీ లను విస్తరణ చేస్తామన్నారు.

ఒకే దగ్గర అన్ని ఫార్మా కంపెనీ లు ఉంటే సిటీ విడిచి పెట్టివెళ్లాల్సి వస్తుందని, కొన్ని కొన్ని ఉంటే వాటిని మెయింటెన్ చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. కుప్ప లాగా ఉంటే రూల్స్ పాటించరని, మెట్రో ను ఎల్ అండ్ టీ అమ్ముకుంటే అమ్ముకొని మేము చేసేది ఏం ఉంటుందన్నారు. వాని ఆస్తి వాడు అమ్ముకుంటే చేసేది ఏం ఉంటుందని, మూసీపై కన్సల్టేన్సీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కేసీఆర్ఆర్ మాదిరిగా మేధావి కాకపోవడం వల్ల మేం కన్సల్టేన్సీ పై ఆధారపడుతున్నామని, మూసీని ఒక ఆదాయ వనరుగా వాడుకుంటామన్నారు. యూటీ అనేది స్టాప్ గ్యాప్ అది ముగిసిన అధ్యాయమన్నారు. యూటీ అని ఎవరైనా ప్రచారం చేస్తే వాడంత తెలివి లేని వాడు ఇంకొకడు లేడని, వరంగల్ ను హైదరాబాద్ దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళతో సఖ్యతగా ఉంటామని సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతా పాజిటివ్ థింకింగ్ మాత్రమే నో నెగెటివ్ థింకింగ్ అని ఆయన స్పష్టం చేశారు. నా ప్రపంచం తెలంగాణనే అని, వంద సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక అందించడమే నా లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మండలాలు, రెవిన్యూ డివిజన్ లను క్రమబద్దికరణ చేయాలి. ఆ తర్వాత జిల్లాల ఏర్పాటు ఉంటుందని, కేసీఆర్ ఇష్టానుసారంగా జిల్లా ఏర్పాటు చేశారని, కోటి జనాభా ఉన్న హైదరాబాద్ కి, ఒక్క నియోజకవర్గం ఉన్న వనపర్తిని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారన్నారు. పాలమూరు పై ప్రత్యేక దృష్టి పెట్టాం. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, అందుకే స్పెషల్ గా పాలమూరు జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్ ను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

Read Also :Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. కనిపించే దానికంటే ప్రమాదకరమా..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • paddy procurement

Related News

Group-1 Candidates

Group-1 Candidates: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఈనెల 27న నియామక పత్రాలు అంద‌జేత‌!

ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, కాబట్టి వారికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు.

  • Dussehra Holidays

    Dussehra Holidays: అంగన్‌వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!

  • Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

    CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

  • Bathukamma Kunta

    Bathukamma Kunta: ఎల్లుండి బతుక‌మ్మ కుంటను ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి!

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • Floods In HYD : సీఎం రేవంత్ వల్లే నేడు హైదరాబాద్ జ‌ల దిగ్బంధం – హరీష్ రావు

  • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

  • Aqua Farmers : ఓ పక్క ట్రంప్..మరోపక్క ద‌ళారుల దోపిడీతో కుదేల్ అవుతున్న ఆక్వా రైతులు

  • Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

  • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd