CM Revanth: అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సీఎం రేవంత్
CM Revanth : అక్టోబర్ మొదటివారంలోనే ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీసం ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేయలేదు
- By Sudheer Published Date - 12:06 PM, Mon - 11 November 24

ధాన్యం కొనుగోలు (Purchase of grain) విషయంలో జరుగుతున్న జాప్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వరి కోతలు పూర్తయ్యాయి..కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టకపోవడం తో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ మొదటివారంలోనే ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీసం ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేయలేదు. అధికారుల వైఫల్యంతో వానకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడుతున్నది.
ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. గత వానకాలంలో 47 లక్షల టన్నులు, యాసంగిలో 48 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకే ఆపసోపాలు పడిన ప్రభుత్వం ఇప్పుడు 91 లక్షల టన్నులు ఏ విధంగా కొనుగోలు చేస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. కొనుగోలు సెంటర్లలో వరి వర్షాలకు నానిపోతుంది..ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎదురుచూపులు అంటూ రేవంత్ సర్కార్ పై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీల సైతం వరి కొనుగోలు విషయంలో ప్రభుత్వం పై విమర్శలు చేస్తుంది.
ఈ క్రమంలో సీఎం రేవంత్ ఈ విషయం పై అధికారులపై సీరియస్ అయ్యాడు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లఘించేవారిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వ్యాపారులపై ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్(ESMA) కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని చెబుతూనే, పంటల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలన్నారు. రైతులను వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
Read Also : National Education Day : జాతీయ విద్యా దినోత్సవం.. నేటికీ అందని ద్రాక్షగా ఉన్నత విద్య