HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Review On Heavy Rains

CM KCR: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ రివ్యూ!

వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అలర్ట్ చేశారు.

  • Author : Balu J Date : 09-07-2022 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Kcr
Cm Kcr

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాల్లోని అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీం లను అప్రమత్తం చేయాలన్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ వున్న నేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూంటానని పరిస్థితులనుబట్టి నేడో రేపో వీడియో కాన్ఫరెన్సు కూడా నిర్వహిస్తానని సీఎం తెలిపారు. జిల్లాలల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా వుండాలని సీఎం అన్నారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ, నష్టాలను జరగకుండా చూసుకోవాలని ప్రజా ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు.

భారీ వానలు వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా వుండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సీఎం విఙప్తి చేశారు. గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని ఈ నేపథ్యంలో, ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత చర్యలు తీసుకోవాలని సీఎం ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 11న ప్రగతి భవన్ లో నిర్వహించతలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ‘రెవెన్యూ సదస్సుల అవగాహన’ సమావేశంతో పాటు, 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించతలపెట్టిన ‘రెవెన్యూ సదస్సులను’ మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీఎం తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • heavy rains
  • meeting
  • telangana

Related News

Char Dham Yatra temporarily suspended due to heavy rains in Uttarakhand.

Char Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు ముంచెత్తడంతో చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

రుద్రప్రయాగ్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదులలో నీటిమట్టాలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో అలకనంద, మందాకిని నదులు రెండూ తమ తమ హెచ్చరిక స్థాయిలకు చేరువవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలపై భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం పడటంతో చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్

  • Farmers should not rush into paddy transplantation – Ministers issue a crucial warning to farmers.

    El Nino Effect: రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు.. రైతులకు మంత్రుల కీలక హెచ్చరిక

  • Smart Ration Cards in Telangana

    Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • Good news for liquor lovers in Telangana.

    Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

  • Groundwater levels falling in Telangana... Is a water crisis inevitable this summer?

    Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?

Latest News

  • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

  • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

  • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

  • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

  • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd