HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Eye On Hat Trick Victory In Telangana

Telangana: హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ ధీమా

దేశవ్యాప్తంగా ఎన్నికల భేరీ మోగనుంది. రానున్న ఎన్నికల్ని బీఆర్ఎస్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు పర్యాయాలు ప్రజల మద్దతుతో అధికార చేపట్టిన కేసీఆర్ తెలంగాణ గడ్డపై హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 21-08-2023 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
New Web Story Copy (59)

Telangana: దేశవ్యాప్తంగా ఎన్నికల భేరీ మోగనుంది. రానున్న ఎన్నికల్ని బీఆర్ఎస్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు పర్యాయాలు ప్రజల మద్దతుతో అధికారం చేపట్టిన కేసీఆర్ తెలంగాణ గడ్డపై హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గలుస్తుందన్న ఆత్మవిశ్వాసంతో గత రిజల్ట్స్ కంటే 5 లేక 6 సీట్లు ఎక్కువే గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపుపై ​​ఎలాంటి సందేహాలు లేదన్నారు.గత ఎన్నికలతో పోలిస్తే 5-6 సీట్లు అధికంగా గెలుస్తామని ఆయన చెప్పారు. 2018లో 119 స్థానాలున్న అసెంబ్లీలో 88 స్థానాలు గెలుచుకుని టీఆర్‌ఎస్ అధికారాన్ని నిలబెట్టుకుందని చెప్పారు. ఇక ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త బిచ్చగాళ్ళు ప్రయత్నిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజలు వాళ్ళని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్క అవకాశం కోరుకుంటున్నారు. గత 50 ఏళ్లలో ఏం చేశారని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీనియర్ సిటిజన్లు, వితంతువులు తదితరులకు నెలకు రూ.4వేలు పింఛన్ చెల్లిస్తామని హామీ ఇస్తోందని బీఆర్‌ఎస్ చీఫ్ చెప్పారు. తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4,000 పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, ఎస్పీ కార్యాలయం, వైద్య కళాశాల, బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాల నూతన భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గతంలో మంత్రులుగా పనిచేశారని, అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు.

సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్ కాలేజీల గురించి ఏనాడూ ఎందుకు ఆలోచించలేదో చెప్పాలన్నారు. నల్గొండ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ రైతు వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని బీజేపీ చెబుతుంటే, రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని కాంగ్రెస్ చెబుతోందన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని కేసీఆర్ అన్నారు. రెండు దఫాలుగా రూ.37,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను దళారుల ప్రమేయం లేకుండా అమలు చేస్తున్నారని, ధరణి పోర్టల్‌ను రద్దు చేసి మధ్యవర్తుల వ్యవస్థను తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్‌ భావిస్తోందని ఆరోపించారు. ధరణి పోర్టల్ లేకుండా రైతు బంధు, రైతుబీమా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌తో కేవలం 15 నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్‌ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఓటు ద్వారానే తమ భవితవ్యాన్ని తామే రాసుకుంటామని, ప్రజలు తమ ఓటును జాగ్రత్తగా వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు.

Also Read: Fuel Price: ఆగస్టు 21 పెట్రోల్ మరియు డీజిల్ ధరలు:


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Polls
  • bjp
  • brs
  • cm kcr
  • congress
  • elections
  • Hat-Trick
  • suryapet
  • telangana
  • telangana politics

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd