Rythu Sabha : రాష్ట్రంలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు..?: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు.
- By Latha Suma Published Date - 03:42 PM, Fri - 17 January 25

Rythu Sabha : రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీరు చేవళ్లలో కేసీఆర్‌కు ఓటేశారు. ఎమ్మెల్యేని గెలిపించారు. కానీ ఆయన అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళాడని ఆగ్రహించారు. చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతుందని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల లోనే కాదు తెలంగాణలోని పది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయని ఆయన తెలిపారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు.
21 వ తారీఖు న నల్గొండ లో మరో రైతు దీక్ష పెడతామని కేటీఆర్ తెలిపారు. ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరానని తెలిపారు. తెలంగాణ లో ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే మా ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తాం అని చెప్పాను… కానీ సీఎం మాట్లాడలేదని కేటీఆర్ చురకలు అంటించారు. కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు రైతుబంధు కింద రూ. 10 వేలు ఇస్తుండు.. నన్ను గెలిపిస్తే రూ. 15 వేలు ఇస్తానని అన్నాడు. ఏడాది దాటిపోయింది.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు 7600 కోట్లు రైతుబంధు వేసేందుకు మేం సిద్ధమైతే ఈసీకి ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి. ఈ టైమ్‌లో వేస్తే కేసీఆర్‌కు ఓట్లు వేస్తారని చెబితే మోడీ ప్రభుత్వం ఆపిందన్నారు.
కానీ ఇవాళ డిల్లీకి పోయి రుణమాఫీ చేసిన అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని కేటీఆర్ నిప్పులు చెరిగారు. అక్కడ స్పీచ్ ఇస్తుండు.. తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన.. ఢిల్లీలో కూడా ఉద్ధరిస్తానని, మీరు నా మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశాం.. రుణమాఫీ చేశాను. 100 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఢిల్లీలో కూడా అదే చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. అక్కడ స్పీచ్ ఇస్తుండు.. తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన.. ఢిల్లీలో కూడా ఉద్ధరిస్తానని, మీరు నా మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశాం.. రుణమాఫీ చేశాను. 100 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఢిల్లీలో కూడా అదే చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా..? కూట్లో రాయి తీయనోడు.. ఏట్లో రాయి తీస్తాడా..? సీఎం అబద్ధాలు చెప్పొచ్చునా..? ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ అమలైంది.. అది కూడా ఫ్రీ బస్సు. మా ఊరికి బస్సే దిక్కు లేదు అని కొందరు లొల్లి పెడుతున్నారని కేటీఆర్ అన్నారు.