HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Worker Dies Of Heart Attack During Bhongir Meeting

BRS Activist Died : కేసీఆర్ ప్రచార సభలో అపశృతి..బిఆర్ఎస్ కార్యకర్త మృతి

పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన సత్తయ్య అనే కార్యకర్త.. సభ ప్రాంగణంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు

  • Author : Sudheer Date : 16-10-2023 - 8:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS worker dies of heart attack
BRS worker dies of heart attack

కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ప్రచారం లో అపశృతి చోటుచేసుకుంది. సోమవారం భువనగిరి (Bhuvanagiri) లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ (Praja Ashirvadha Sabha) లో ఓ కార్యకర్త గుండెపోటు (BRS activist died)తో మరణించారు. నవంబర్ 30 న తెలంగాణ లో ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ (KCR) నిన్న ఆదివారం నుండి ప్రచారం మొదలుపెట్టారు. ముందుగా హుస్నాబాద్ లో భారీ సభ ఏర్పాటు చేసిన కేసీఆర్..నేడు జనగాం , భువనగిరి సభల్లో పాల్గొన్నారు.

భువనగిరి సభకు కార్యకర్తలు పోటెత్తారు. ఈ క్రమంలో పోచంపల్లి మండలం జూలూరుకు చెందిన సత్తయ్య  (G Sathaiah)అనే కార్యకర్త.. సభ ప్రాంగణంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన మిగతా కార్యర్తలు.. హుటాహుటిన సత్తయ్యను ఆస్పత్రికి తరలించారు. అయితే.. సత్తయ్యను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు (Heart Attack) నిర్దారించారు. ఈ ఘటన.. సీఎం కేసీఆర్ వచ్చేకంటే ముందే జరగ్గా.. సభలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొనలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఫై విమర్శల వర్షం కురిపించారు. ‘కౌలు రైతు అంటే వ్యవసాయం చేసుకునేందుకు భూమిని మరొకరికి కిరాయికి ఇస్తాం. హైదరాబాద్‌లో భూములను కిరాయికి ఇస్తరు. ఇక్కడెందుకు కబ్జాదారుల పేరు రాయరు. రైతులు అగ్గువకు దొరికారు.. రైతులతో ఆటాడుకోవచ్చనే దురుద్దేశంతో.. రైతులను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్‌ రాజ్యం మళ్లీ రావాలా..? మళ్లీ పాత బాధలు కలగాలా? దయచేసి రైతు సోదరులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న కాంగ్రెస్‌ దెబ్బపడుతుంది. మళ్లీ పాత పైరవీకారులు వస్తరు.. వీఆర్వోలు వస్తరు.. రికార్డులు మారుతయ్‌.. చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి’ అన్నారు.

భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది కాంగ్రెస్సేనని .. అలాంటి అరాచక శక్తులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించిందని కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు కరవు ప్రాంతమైన భువనగిరిలో.. ఇప్పుడు పుష్కలంగా పంటలు పండుతున్నాని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌ను మరోసారి గెలిపిస్తే భువనగిరిలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Read Also : Chinta Mohan : తెలంగాణలో కాంగ్రెస్ 75 స్థానాలతో అధికారం చేపట్టబోతుంది – కేంద్ర మాజీ మంత్రి కామెంట్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs Bhongir meeting
  • BRS worker dies
  • kcr
  • Praja Ashirvadha Sabha

Related News

Quit India Movement..The foundation of the Congress movement: TPCC President Mahesh Kumar Goud's comments

BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

BRS : భారత్ రాష్ట్ర సమితి (BRS) భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చరిష్మా, ఆయన కుటుంబంలో మరెవ్వరికీ లేదని మహేశ్ అన్నారు

    Latest News

    • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

    • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

    • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

    • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

    • తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd