HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Telangana Peoples Party

BRS : బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక – కేటీఆర్

BRS : తెలంగాణ రాష్ట్రం కోసమే బిఆర్ఎస్ ఆవిర్భవించిందని, పోరాటం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదని, వైస్ రాజా శేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, రేవంత్ రెడ్డి ఎంత అని హెచ్చరించారు

  • Author : Sudheer Date : 17-10-2024 - 7:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Brsv
Ktr Brsv

బీఆర్ఎస్ (BRS) పార్టీ అంటే కేసీఆర్‌దో, కేటీఆర్‌దో కాదు.. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల గొంతుక అని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని గురువారం బీఆర్ఎస్‌వీ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్‌వీ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్..కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్రం కోసమే బిఆర్ఎస్ ఆవిర్భవించిందని, పోరాటం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదని, వైస్ రాజా శేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, రేవంత్ రెడ్డి ఎంత అని హెచ్చరించారు. నదులు ఎక్కడ ఉన్నాయో, విప్రో ఛైర్మెన్ ఎవరో తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి, మనకి ముఖ్య మంత్రి కావడం దౌర్భాగ్యమన్నారు. స్వీయ రాజ‌కీయ అస్తిత్వ‌మే తెలంగాణ‌కు శ్రీరామ‌ర‌క్ష.. కేసీఆర్ నాయ‌క‌త్వం, గులాబీ జెండానే తెలంగాణ‌కు ర‌క్ష‌ణ‌. ఈ పార్టీ మ‌రో 75 ఏండ్ల పాటు ఒక డీఎంకే లాగా, శిరోమ‌ణి అకాలీద‌ళ్‌ లాగా ఉంట‌ది. ఈ పార్టీ మ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌ది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌తో మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాలి. కాంగ్రెస్‌నే శ‌త్రువుగా చూడాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణ స‌మాజానికి మ‌రింత డేంజ‌ర‌స్ పార్టీ బీజేపీనే. మ‌తాల‌ను అడ్డంపెట్టుకుని, మ‌త‌ప‌ర‌మైన రాజ‌కీయాలు చేస్తూ.. దేవుడిని అడ్డుపెంట్టుకుని పిల్ల‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారు.. తెలంగాణ‌కు బిజెపి చేసిందేమీ లేదన్నారు. 32 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ప్ర‌తి జిల్లాలో బీఆర్ఎస్వీ స‌మావేశాలు జ‌ర‌గాలి. మండ‌లం, నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో క‌మిటీలు వేసుకుందాం. స‌మ‌ర్థ‌వంత‌మైన విద్యార్థి నాయ‌కులు ఉన్నారు. వారిని జిల్లాల‌కు పంపుదాం. మండ‌ల క‌మిటీ, కాలేజీ క‌మిటీల‌ను భ‌ర్తీ చేసి కొత్త నాయ‌క‌త్వాన్ని ఎంక‌రేజ్ చేసుకుందాం. ఎక్క‌డిక‌క్క‌డ సోష‌ల్ మీడియాలో క్రియాశీల‌క పాత్ర పోషించాలి. కేసుల‌కు భ‌య‌ప‌డొద్దు అని భరోసా ఇచ్చారు.

నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని, ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చినా తెలంగాణ భవన్ అక్కున చేర్చుకుంటుందని స్పష్టం చేశారు. జీవో 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, వారి కోసం అశోక్ నగర్ పోదామని అనుకుంటే అక్కడ ఎక్కడ చూసినా పోలీసులను దింపారని మండిపడ్డారు. గ్రూప్ 1 అభ్యర్థులే తెలంగాణ భవన్‌కు వచ్చారని, వారికి అండగా బీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు.

Read Also : Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం..అందరికీ ఉపాధి..మా ప్రభుత్వ ఆలోచన: సీఎం రేవంత్ రెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • ktr
  • telangana

Related News

siddaramaiah-and-dk-shivakumar

Karnataka : వీడ్కోలు సమావేశంలో భావోద్వేగ క్షణాలు.. డీకేకు ఆశీర్వాదం ఇచ్చిన సిద్దరామయ్య

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారిక నివాసం ‘కావేరి’లో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. సమావేశానికి హాజరైన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిని ఆత్మీయంగా ఆలింగనం చేసు

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Transfers

    Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • Mahanadu : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

  • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

  • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd