HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Reins For Newcomers Ktr

BRS: బీఆర్ఎస్ ప‌గ్గాలు కొత్త‌వారికి: కేటీఆర్‌

పార్టీ బ‌లోపేతానికి ఈ మార్పు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అధ్య‌క్షుడి పేరును కూడా ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కానున్న‌ట్లు తెలుస్తోంది.

  • Author : Gopi Date : 31-12-2024 - 10:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS
BRS

BRS: తెలంగాణను గ‌త ప‌దేళ్లు పాలించిన బీఆర్ఎస్ (BRS) పార్టీకి కొత్త అధ్య‌క్షుడు రానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అయితే కొత్త సంవ‌త్స‌రంలో బీఆర్ఎస్ కొత్త అధ్య‌క్షుడి కోసం ఎన్నిక జ‌ర‌గ‌నున్నట్లు స్ప‌ష్టం చేశారు. అయితే పార్టీ బ‌లోపేతం కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి అధ్య‌క్షుడిగా ఉన్న కేసీఆర్‌నే మ‌రోసారి అధ్య‌క్షుడిగా ఎన్నుకుంటారా? లేక‌పోతే కొత్త నాయ‌కుడికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2025లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. 2025 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం. పార్టీ శిక్షణ కార్యకలాపాలను, సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతాం.ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది. గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేస్తూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం అని ఆయ‌న తెలిపారు.

Also Read: Hero Yash: అలా చేయకండి అంటూ.. కీలక ప్రకటన చేసిన ‘రాఖీభాయ్‌’

అయితే పార్టీ బ‌లోపేతానికి ఈ మార్పు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అధ్య‌క్షుడి పేరును కూడా ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కానున్న‌ట్లు తెలుస్తోంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా హ‌రీశ్ రావు లేదా ఎమ్మెల్సీ క‌విత‌కు ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే బీసీల‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వాల‌ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ సైతం ఇదే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్న‌ట్లు కేటీఆర్ ఇటీవ‌ల తెలిపారు.

స్థానిక ఎన్నిక‌లే ల‌క్ష్యం

బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో మెజార్టీ స్థానాల్లో విజ‌యం సాధించి కేడ‌ర్ బ‌లంగా ఉంద‌ని సంకేతాలు కాంగ్రెస్ కు ఇవ్వాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే గ్రామ‌స్థాయిలో బీఆర్ఎస్ బ‌లోపేతానికి స్థానిక నాయ‌కులతో కేటీఆర్ చ‌ర్చ‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యానికి కేసీఆర్ కూడా తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వ‌స్తార‌ని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS New Plan
  • BRS New President
  • congress
  • kcr
  • ktr
  • MLA Harishrao
  • MLC Kavitha
  • telangana politics

Related News

Mynampalli Rohith

Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Latest News

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd