BRS MLA U-Turn: బీఆర్ఎస్ ఎమ్మెల్యే యూటర్న్, రేవంత్ ను కలిసిన కృష్ణమోహన్ రెడ్డి
శుక్రవారం కృష్ణమోహన్ రెడ్డి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కలిసి బయల్దేరి వెళ్లారు.ఎక్సైజ్ మంత్రితో కలసి అధికార పార్టీలో కొనసాగేందుకు ఒప్పించిన మరుసటి రోజే ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే భేటీ కావడం విశేషం.
- By Praveen Aluthuru Published Date - 03:24 PM, Fri - 2 August 24

BRS MLA U-Turn: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. గత నెలలో బీఆర్‌ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం దాన్ని కొట్టిపారేశాయి. ఫ్రెండ్షిప్ కొద్దీ కలిశాడని కృష్ణమోహన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు.
శుక్రవారం కృష్ణమోహన్ రెడ్డి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కలిసి బయల్దేరి వెళ్లారు.ఎక్సైజ్ మంత్రితో కలసి అధికార పార్టీలో కొనసాగేందుకు ఒప్పించిన మరుసటి రోజే ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే భేటీ కావడం విశేషం.
మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్ నియోజకవర్గం నుంచి కృష్ణమోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఇద్దరూ ఒకే జిల్లా నుంచి వచ్చారు. అయితే నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ నేతలు తన పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకించడంపై ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని తన మద్దతుదారులకు నచ్చజెప్పి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రికి తెలియజేసినట్లు తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు.
జూలై 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీలో చేరారు. మార్చి నుండి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ జెండాపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఫిరాయింపుదారుల్లో ఒకరైన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఫిరాయింపుదారులు హాజరయ్యారు. ఫిరాయింపుదారులకు అధికార పార్టీలో మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు.
119 స్థానాలున్న అసెంబ్లీలో బీఆర్‌ఎస్ 39 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ చేతిలో ఓటమితో దాని సంఖ్య 28కి పడిపోయింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ సంఖ్య 72కి చేరింది.త్వరలో మరిన్ని చేరికలు ఉండబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఎవరున్నా లేకపోయినా వచ్చేది తమ పార్టీనే అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
Also Read: Fenugreek: మెంతులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?