Fenugreek: మెంతులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?
సరైన మోతాదులో మెంతులను తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:49 PM, Fri - 2 August 24

పోపు దినుసుల్లో ఒకటైన మెంతుల గురించి మనందరికీ తెలిసిందే. ఈ మెంతులను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఉపయోగించి రకరకాల వంటలు కూడా తయారు చేస్తారు.. మెంతులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు మెంతులు తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. మరి మెంతుల వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారికి మెంతులు బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు. మెంతులు పీచు, ఖనిజాలు, ఇతర పోషకాలను కలిగి ఉంటాయి.
ఒక టేబుల్ స్పూన్ మెంతులు రోజువారీ విలువలో 20 శాతం ఇనుము, 7 శాతం మాంగనీస్, 5 శాతం మెగ్నీషియంను అందిస్తాయి. కాగా మెంతులు ఆకలిని తగ్గించి,కడుపు నిండి భావాన్ని కలిగిస్తాయి. తద్వారా బరువు తగ్గాలనుకునేవారు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. మెంతులు తింటే వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది. మెంతి గింజలలోని శ్లేష్మం జీర్ణశయాంతర చికాకును తగ్గించడంలో సహాయపడుతుందట. అలాగే మెంతులు గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు మంచిదట. మెంతికూరలో ఉండే సపోనిన్ లు కొవ్వు పదార్ధాల నుంచి కొలెస్ట్రాల్‌ను శరీరం శోషించడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
మెంతులను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు వైద్యులు. మెంతులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందట. మెంతులు హైపర్‌గ్లైసీమిక్ సెట్టింగ్ లలో ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయట. ఈ విత్తనాలు పీసీఓఎస్ లేదా పీసీఓడీ కోసం అద్భుతమైనవి. ముఖ్యంగా మెంతులు రక్తహీనత చికిత్సలో సహాయపడతాయట. ముఖ్యంగా తల్లి పాల ఉత్పత్తిని పెంచుతాయని చెబుతున్నారు. అలాగే పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయట. అలాగే క్యాన్సర్‌ను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెంతులు వాడే వ్యవధిని బట్టి మంటను తగ్గించడంతో రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.