HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Mla Bandla Krishna Mohan Reddy Joins Congress Party

MLA Bandla Krishna Mohan Reddy : కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..

అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా ఎమ్మెల్యేలు వరుసపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు

  • Author : Sudheer Date : 06-07-2024 - 12:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandla Cng
Bandla Cng

కాంగ్రెస్ పార్టీ (Congress) అన్నంత పని చేస్తుంది..త్వరలోనే బిఆర్ఎస్ ఖాళీ అవుతుందని..బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా వారంతా కాంగ్రెస్ లోకి వస్తారని చెపుతూ వస్తుండగా..ఇప్పుడు అదే జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా ఎమ్మెల్యేలు వరుసపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..ఇప్పుడు మరో ఎమ్మెల్యే అదే బాటలో నిలిచారు. గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి (MLA Bandla Krishna Mohan Reddy) కాంగ్రెస్‌ లో చేరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరబోతున్నారనే వార్త బయటకు వచ్చిన దగ్గరి నుండి స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ లో చేరిన గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. సరిత అనుచరులు గురువారం ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కడం, పెట్రోల్‌ పోసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగి, సరితా తిరుపతయ్యతో భేటీ అయ్యి నచ్చజెప్పారు. అలాగే, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ కాంగ్రెస్‌లో చేరినా సరితకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటె 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలుచుకోగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పటివరకు బిఆర్ఎస్ నుండి కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య లు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు. ప్రస్తుతం బిఆర్ఎస్ లో 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Read Also : Bonalu 2024 : హైదరాబాద్ లో మొదలైన బోనాల సందడి..రేపు గోల్కొండ బోనాల జాతర


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • congress
  • Gadwala MLA joined the Congress
  • MLA Bandla Krishna Mohan Reddy

Related News

    Latest News

    • E Commerce – ఇ-కామర్స్ డార్క్ ప్యాటర్న్స్ రిపోర్ట్ 2026

    • Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్‌ను ఎందుకు ఇష్టపడతారు…?

    • Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!

    • Vastu And Money: వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలో తెలుసా..?

    • Indriya – Aditya Birla Jewellery : భారతీయ సంస్కృతి అద్దంపట్టేలా ‘ఇంద్రియ’ అద్భుత ఆవిష్కరణ

    Trending News

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd