Mallareddy: రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది.. మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్
మాజీ మంత్రి మల్లారెడ్డి తెలియనివారు ఉండరు. ఆయన మాట్లాడే తీరు, చెప్పే విధానం భిన్నంగా ఉంటుంది.
- Author : Gopichand
Date : 06-05-2024 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) తెలియనివారు ఉండరు. ఆయన మాట్లాడే తీరు, చెప్పే విధానం భిన్నంగా ఉంటుంది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్ ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రధాన మూడు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని పార్టీలు తమకు ఇన్ని సీట్లు వస్తాయంటే.. మరోక పార్టీ మాకే ఎక్కువ సీట్లు వస్తాయని ఓటర్ల ముందు ధీమాగా చెబుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజాగా జరిగిన ఓ సభలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ఓటింగ్ శాతానికి దగ్గరలో కూడా లేవన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్ గిరి పార్లమెంట్ 38 శాతం, కంటోన్మెంట్లో 42 శాతం ఓటింగ్ పడే అవకాశముందన్నారు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ కు 27 శాతం, బీజేపీ 28 శాతం మాత్రమే ఓటింగ్ ఉందని ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు.
Also Read: Amarnath Pigeon’s Story: అమర్నాథ్ గుహలో ఉన్న జంట పావురాల రహస్యం ఏంటో తెలుసా..?
రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుంది
లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్ గిరి పార్లమెంట్ 38 శాతం, క్యాంటన్మెంట్లో 42 శాతం ఉంది, బీజేపీ 28, కాంగ్రెస్ పార్టీకి 27 శాతమే ఉంది – ఎమ్మెల్యే మల్లారెడ్డి pic.twitter.com/mi0oN4p4wv
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024
ఇకపోతే తెలంగాణలో 4 దశలో ఎంపీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లును చేశారు. మరో 5 రోజుల్లో రాజకీయ పార్టీల ప్రచారానికి కూడా తెరపడనుంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఆ రోజు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. ఈసారి దేశంలో మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
We’re now on WhatsApp : Click to Join