Vinod: గురువు కోసమే బ్యారేజీ కొట్టుకుపోయేలా రేవంత్ కుట్రలు: వినోద్
- By Latha Suma Published Date - 04:38 PM, Wed - 28 February 24

Vinod: బీఆర్ఎస్(brs) సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్(Vinod) సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy)పై తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయని ఆయన చెప్పారు. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే సరిపోతుందని… అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే మరమ్మతులు చేయడం లేదని… బ్యారేజీ కొట్టుకుపోతే గోదావరి నదీ జలాలు కింద ఉన్న ఏపీకి వెళ్తాయని… ఇది జరగాలనేదే రేవంత్ కుట్ర అని చెప్పారు. తన గురువు, టీడీపీ(tdp) అధినేత చంద్రబాబు(chandrababu) కోసమే రేవంత్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
చాలా ఎత్తులో ఉండే తెలంగాణ(telangana)లో గోదావరి జలాలను పారించడం కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమయిందని వినోద్ చెప్పారు. దాదాపు 400 మీటర్ల ఎత్తుకు నదీ జలాలను ఎత్తి పోశామని, కోటి ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవాలు ఏమిటో చూపించేందుకే మార్చి 1న కాళేశ్వరం పర్యటనకు వెళ్తున్నామని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
చేవెళ్ల సభలో కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారమదంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులకే నమ్మకం ఉండదని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడితే తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. కష్టపడితే అన్ని లోక్ సభ స్థానాలను గెలుచుకోవచ్చని అన్నారు.
read also : CM Jagan: రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఏపీ: సీఎం జగన్