Hyderabad: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కారు బీభత్సం.. ప్రజాభవన్ ను ఢీ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ నగర రోడ్లపై నానా రచ్చ చేశాడు. ఈ క్రమంలో భారీ ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే
- Author : Praveen Aluthuru
Date : 26-12-2023 - 6:39 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ నగర రోడ్లపై నానా రచ్చ చేశాడు. ఈ క్రమంలో భారీ ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ అమీర్ గత రాత్రి వేగంగా కారు నడుపుతూ ప్రజాభవన్ భారీకేడ్లను ఢీ కొట్టాడు. సమీప దూరంలో ఉన్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని గమనించారు. అందులో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఘటన అనంతరం మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ పరారు కాగా వాళ్ళ ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్టు చూపించాలని ప్రయత్నించినట్టు డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు.
ప్రమాదానికి గురైన కారు బీఎండబ్ల్యూగా చెప్తున్నారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా కారుతో విధ్వంసం సృష్టించి రాహెల్ ఒకరి మరణానికి కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు. రాహెల్ పై గతంలో జూబ్లీహిల్స్ లో యాక్సిడెంట్ కేసు నమోదైందని తెలిపారు. అయితే పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అతను తప్పించుకున్న నేపథ్యంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Beauty Tips: మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించాల్సిందే?