BRS: అప్పటి రోజులు మళ్లీ వచ్చాయి
- By Kavya Krishna Published Date - 10:37 AM, Sat - 9 March 24

బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని సందు దొరికినప్పుడల్లా ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవని బీఆర్‌ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే.. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలను అమలు చేస్తోంది. ఇటీవల గృహజ్యోతి పథకం కింద రూ.500లకే సిలిండర్‌ను అందజేసేందుకు అన్ని సిద్ధమయ్యాయి. అంతేకాకుండా.. 200 యూనిట్లలోపు కరెంట్ వచ్చిన వినియోగదారులకు జీరో కరెంట్ బిల్లులను అందించారు అధికారులు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. కరెంట్ విషయానికొస్తే రైతులకు నాణ్యమైన కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేఏకపోతోందని, గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగినట్లే రైతుల మరణం సంభిస్తున్నాయంటూ బీఆర్‌ఎస్ ఆరోపణలు గుప్పిస్తోందిది. ఈ నేపథ్యంలోనే ‘కాంగ్రెస్ వచ్చింది.. రైతన్నలకు కష్టాలు తెచ్చింది’ అంటూ BRS పార్టీ విమర్శలు గుప్పించింది. నల్గొండ జిల్లా చిన్ననేమిలకు చెందిన రైతు రావుల లింగయ్య రాత్రి కరెంట్ కోసం పొలం దగ్గరకు వెళ్లి పాముకాటుతో చనిపోయాడని పోస్ట్ చేసింది. కాలువలో నీళ్లు రాక పంట ఎండిపోతుందని రాత్రి త్రీఫేజ్ కరెంట్ కోసం ఆయన పొలానికి వెళ్లారని తెలిపింది. ‘అప్పటి రోజులు మళ్లీ వచ్చాయి’ అని ట్వీట్ చేసింది.
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తన గూటికి చేర్చుకోవడం ద్వారా బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును కాంగ్రెస్ విజయవంతంగా కొల్లగొడుతోంది. ఇది ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుంది, అయితే ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అంతటా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బీజేపీ కంటే 16,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమపై విధించిన సస్పెన్షన్‌లను ఉపసంహరించుకోవడం ద్వారా తమ సీనియర్ నేతల సేవలను వచ్చే లోక్‌సభ ఎన్నికలకు వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఒకానొక సందర్భంలో ఆదిలాబాద్ డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండేపై సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read Also : Pakistan Student: ప్రాణాల మీదకు తీసుకొచ్చిన వాట్సాప్.. 22 ఏళ్ల విద్యార్థికి మరణశిక్ష విధించిన కోర్టు..!