BRS Party : మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
- Author : Latha Suma
Date : 22-03-2024 - 2:02 IST
Published By : Hashtagu Telugu Desk
BRS Party : మరో రెండు పార్లమెంట్ స్థానాల( Parliament Seats)కు బీఆర్ఎస్ అభ్యర్థుల(BRS Candidates)ను ఆ పార్టీ అధినేత కేసీఆర్(kcr) ప్రకటించారు. నాగర్‌కర్నూల్(Nagarkurnool) ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar), మెదక్(Medak) ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పీ వెంకట్రామిరెడ్డి(P Venkatramireddy)ని బరిలో దించుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాం రెడ్డిని కేసీఆర్… pic.twitter.com/eZlvzD1g0b
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2024
We’re now on WhatsApp. Click to Join.
కాగా, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యాక.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కచ్చితంగా ఆశించిన సీట్లను దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితేచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
read also: Voice Messages To Text : వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్‌లోకి మార్చేసే వాట్సాప్ ఫీచర్