Voice Messages To Text : వాయిస్ మెసేజ్‌ను టెక్ట్స్‌లోకి మార్చేసే వాట్సాప్ ఫీచర్
Voice Messages To Text : వాట్సాప్‌లో మనకు కొందరు ఫ్రెండ్స్, సన్నిహితులు వాయిస్ మెసేజ్‌లను పంపుతుంటారు.
- Author : Pasha
Date : 22-03-2024 - 1:36 IST
Published By : Hashtagu Telugu Desk
Voice Messages To Text : వాట్సాప్‌లో మనకు కొందరు ఫ్రెండ్స్, సన్నిహితులు వాయిస్ మెసేజ్‌లను పంపుతుంటారు. వాటిని టెక్ట్స్ రూపంలోకి మార్చుకునే వసతి ఉంటే ఎంతో బాగుంటుంది కదూ!! మనం అనుకున్నా.. వాట్సాప్ చేసి చూపించింది. !! ఈ తరహా ఫీచర్‌ను వాట్సాప్ రెడీ చేసింది. దీని పేరే ‘వాయిస్ నోట్ ట్రాన్‌స్క్రిప్షన్’!! దీన్ని వాడుకొని మనం వాయిస్ సందేశాలను టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవచ్చు. వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లను మనం కొన్ని సందర్భాల్లో వినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఆడియో క్లిప్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చుకొని చదువుకునేందుకు ఈ ఫీచర్ (Voice Messages To Text) మార్గాన్ని సుగమం చేయనుంది.
We’re now on WhatsApp. Click to Join
ఓపెన్ చేసి వినాల్సిన అవసరం లేకుండా..
‘వాయిస్ నోట్ ట్రాన్‌స్క్రిప్షన్’ ఫీచర్ సాయంతో వాయిస్ మెసేజ్‌లను మనం నేరుగా టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవచ్చు. కాబట్టి ఇక వాటిని ఓపెన్ చేసి వినాల్సిన అవసరం ఉండదు. కేవలం టెక్స్ట్ రూపంలోని మెసేజ్‌ను చదివి రిప్లై ఇస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌ను వాట్సాప్ ఇప్పటికే కొంతమంది ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
Also Read : Blindsight : కంటిచూపు లేని వారికి ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్
ట్రాన్స్‌స్క్రిప్షన్ జరిగేది ఇలా..
‘వాయిస్ నోట్ ట్రాన్స్‌స్క్రిప్షన్’ ఫీచర్‌ను వాడాలంటే.. వాట్సాప్ యూజర్లు అదనంగా 150ఎంబీ యాప్ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాయిస్ నోట్స్‌ను టెక్ట్స్‌లోకి మార్చడానికి డివైజ్ స్పీచ్ రికగ్నిషన్ ఫీచర్లను వాట్సాప్ వాడుకోనుంది. ఫలితంగా ట్రాన్‌స్క్రిప్షన్ అనేది డివైజ్‌లోనే అంతర్గతంగా జరుగుతుంది. దీనివల్ల యూజర్లకు ఎలాంటి ప్రైవసీ ఇబ్బందులు కూడా కలగవు. ఈ ఫీచర్‌ను వినియోగించేవారికి మెసేజ్ బబుల్స్‌లో, వాయిస్ నోట్స్ టెక్ట్స్ రూపంలో కనిపిస్తుంది. ఇంకా డెవలప్మెంట్ స్టేజీలోనే ఉన్న ఈ నయా ఫీచర్ త్వరలోనే స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read :Sarath Chandra Reddy : శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేశాక.. బీజేపీకి ‘అరబిందో’ 30 కోట్లు
వాట్సాప్ ఛాట్‌లోనే క్యూఆర్ కోడ్
వాట్సాప్ చాలా ఫీచర్లను ఇటీవల కాలంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీడియో స్టేటస్ అప్‌డేట్స్, వాట్సాప్ పేమెంట్స్ విషయంలోనూ కీలక మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఉన్న 30 సెకెన్ల వీడియో స్టేటస్ లిమిట్‌ను ఒక నిమిషానికి పెంచేలా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాట్సాప్ యూజర్ల పేమెంట్స్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు.. ఛాట్ లిస్ట్‌లోనే క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించేలా మార్పులు చేశారు.