MLA VenkataRamana Reddy : 45 రోజుల్లోగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్ల నుంచి స్పీకర్ దాకా చేస్తున్న విదేశీ పర్యటనలపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(MLA VenkataRamana Reddy) ఫైర్ అయ్యారు.
- By Pasha Published Date - 04:42 PM, Mon - 20 January 25

MLA VenkataRamana Reddy : మరో 45 రోజుల్లోగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. తాను చెబుతున్నది పక్కాగా జరిగి తీరుతుందని, అందరూ రాసిపెట్టుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రా తరహాలో తెలంగాణలో వికాసం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం భీమవరంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :UPI Vs Saifs Attacker : సైఫ్‌పై ఎటాక్.. యూపీఐ పేమెంట్‌తో దొరికిపోయిన దుండగుడు
కేటీఆర్ తప్పులు నిరూపితం అవుతాయ్
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన తప్పులు కోర్టులో నిరూపితం అవుతాయని వెంకటరమణారెడ్డి చెప్పారు. తప్పు చేసింది ఎంతటి వాళ్లైనా శిక్షకు అర్హులేనన్నారు.కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసిందని ఆయన గుర్తుచేశారు. ఆ కేసు వ్యవహారంలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎటువంటి వాతావరణాన్ని సృష్టించారనేది గ్రామాల్లోని ప్రజలందరికీ తెలుసన్నారు.
Also Read :Clean Energy Policy : అద్భుతంగా ‘క్లీన్ ఎనర్జీ పాలసీ’.. చంద్రబాబు విజన్‌పై యావత్ దేశంలో చర్చ
తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్ల నుంచి స్పీకర్ దాకా చేస్తున్న విదేశీ పర్యటనలపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(MLA VenkataRamana Reddy) ఫైర్ అయ్యారు. వాటి వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదన్నారు. విదేశీ టూర్ల వల్ల తెలంగాణకు వచ్చే ప్రయోజనానికి సంబంధించిన లెక్కలను పేపర్‌పై రాసి చూపించే తెలివి ఏ ఒక్కరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతలు, అధికారుల విదేశీ టూర్లకు కోట్లు ఖర్చవుతుంటే.. రాష్ట్రానికి లక్షలు కూడా ప్రయోజనం చేకూరే పరిస్థితి లేదన్నారు. జవాబుదారీగా ఈ ప్రయోజనానికి సంబంధించిన లెక్కలను ప్రజలకు చూపించే సత్తా కలిగిన వాళ్లే విదేశీ టూర్లు చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోడీని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఆయన సూచించారు.