HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Josh In North Telangana

BJP : ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా

BJP : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని, రాబోయే రోజుల్లో బీజేపీ ఇంకా బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు

  • Author : Sudheer Date : 06-03-2025 - 4:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp
Bjp

ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎంపీ స్థానాలను సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించడం బీజేపీ బలాన్ని రుజువు చేస్తోంది. ఈ విజయాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బీజేపీ పెరుగుతున్న ప్రాధాన్యత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తాజాగా జరిగిన కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో బీజేపీ నేత బండి సంజయ్ ప్రసంగించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మోడీ ప్రభుత్వ నిష్కళంక పాలనను ప్రజలు గుర్తించారని, అందుకే వరుస విజయాలు సాధించగలుగుతున్నామన్నారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు గెలవడం ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.

MLC Results: బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘనవిజయం

కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రజలు డబ్బుకు లొంగకుండా బీజేపీకి పట్టం కట్టారని, ఓటింగ్‌లో నిజాయితీ విజయాన్ని సాధించిందని తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల)పై అనేక ఆరోపణలు చేసినప్పటికీ, ఈసారి బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీజేపీని ఓడించేందుకు యత్నించాయని, కానీ ప్రజలు వారి కుట్రలను తిప్పికొట్టారని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని, రాబోయే రోజుల్లో బీజేపీ ఇంకా బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ విజయపథంలో దూసుకుపోతున్నట్లు తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • MLC Elections win
  • modi
  • North Telangana
  • telangana

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Ntrs Birth Anniversary Junior Ntr Kalyan Ram Ntr Ghat Hyderabad Ntr

    NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

Latest News

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

  • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

  • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

  • ‘Aakash’ Educational Gift : దేశ రక్షణ దళాలకు ‘ఆకాశ్’ విద్యా కానుక

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd